Kitchen Tips: కూరలో కారం ఎక్కువైతే.. ఇలా సరిచేయండి

First Published Dec 30, 2023, 1:17 PM IST

Kitchen Tips: కొన్నికొన్ని సార్లు పొరపాటున కూరల్లో కారం, మసాలా దినుసులు ఎక్కువ అవుతుంటాయి. దీనివల్ల కూరలను ఎవరూ తినరు. అందుకే చాలా మంది వీటిని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. కారాన్ని సరిచేయొచ్చు. అదెలాగంటే?

రెగ్యులర్ గా వంట చేస్తున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు, కారాలు ఎక్కువ అవుతుంటాయి. ఇది కామనే అయినా.. ఇలాంటి కూరలను నోట్లో పెట్టడం చాలా కష్టమే. అయితే చాలా మంది కూరల్లో ఉప్పు ఎక్కువైతే సరిచేస్తుంటారు. కానీ కారం ఎక్కువైతే మాత్రం ఏం చేయాలో తోచదు. ఇలాంటి కూరలు డస్ట్ బిన్ పాలు అవుతుంటాయి. అయితే కూరల్లో కారం, మసాలా దినుసులు ఎక్కువైనప్పుడు చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి కూరలను మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో సరిచేయొచ్చు. 
 

ఆరోగ్యంపై స్పైసీ ఫుడ్ ఎఫెక్ట్

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. ఎక్కువ కారంగా ఉండే ఆహారాలు ఎసోఫాగిటిస్ కు కారణం కావొచ్చు. క్యాప్సైసిన్ తరచుగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లక్షణాలను ప్రేరేపిస్తుందని పరిశోధనలో తేలింది. స్పైసీ ఫుడ్ కూడా ఎన్నో రకాల అజీర్ణానికి కారణమవుతుంది.

పాల ఉత్పత్తులు

కూరల్లో కారం తగ్గించడానికి పాల ఉత్పత్తులు బాగా ఉపయోగపడతాయి. క్యాప్సైసిన్ అనే రసాయనం వల్లే మనకు కారంగా అనిపిస్తుంది. కారంలో ఉండే క్యాప్సైసిన్ మన నాలుకకు అంటుకుని ఇలా అవుతుంది. అయితే పాలు , పాల ఉత్పత్తులలో కేసైన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన నాలుకకు చేరుకునే ముందు క్యాప్సైసిన్ తో బంధించగలదు. అందుకే ఇది తక్కువ గ్రాహకాలకు చేరుకుంటుంది. ఇది మసాలా, కారం అనుభూతిని తగ్గిస్తుంది. కూరలు కారంగా ఉంటే.. దాన్ని తగ్గించడానికి హెవీ క్రీమ్, పెరుగు, సోర్ క్రీమ్ లేదా వెన్నను దాంట్లో వేయండి. 
 

సిట్రస్ పండ్లు

క్యాప్సైసిన్ ఒక ఆల్కలీన్ అణువు. కాబట్టి సిట్రస్ పండ్ల రసం లేదా వెనిగర్ వంటి ఆమ్లాలను వాటిలో కలపడం వల్ల కారం తగ్గుతుంది. పాల ఉత్పత్తులు కూడా ఆమ్లంగా ఉంటాయి. అందుకే ఇవి కారాన్ని  తగ్గించడంలో ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఎప్పుడైనా కూర మరీ కారంగా అయినప్పుడు నిమ్మరసం లేదా నారింజ రసం లేదా వెనిగర్ ను కలపండి. ఇది వంటలను కూడా టేస్టీగా చేస్తుంది.
 

డ్రై ఫ్రూట్స్ నట్ బటర్ 

గింజలు, నట్స్ వెన్నలు వంటి కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు క్యాప్సైసిన్ లోని కారాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది కారం రుచిని తగ్గిస్తుంది. ఒక స్కూప్ నట్స్ వెన్నను జోడించడం కారం తగ్గుతుంది. అలాగే ఇది మీ వంటకు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలను కూడా అందిస్తుంది. 
 

చక్కెర 

మసాలాను, కారాన్ని తటస్తం చేయడానికి చక్కెర-నీటి ద్రావణాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే దీన్ని సరైన మొత్తాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యం. వంటగదిలో సాధారణంగా ఉపయోగించే చక్కెరను కారాన్ని తగ్గించడానికి ఉపయోగించొచ్చు. ఇందుకోసం గ్రాన్యులేటెడ్ చక్కెర, బ్రౌన్ షుగర్, తేనె లేదా మాపుల్ సిరప్ లో ఏదో ఒకదాన్ని కూరపై కొంచెం చల్లండి. 
 

పిండి పదార్ధం లేదా ధాన్యాలు 

మసాలా ప్రభావాన్ని, కారాన్ని తగ్గించడానికి పిండి పదార్థం కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కూరలో కారం ఎక్కువైనప్పుడు బియ్యంపిండి లేద ఉడకబెట్టిన బంగాళాదుంపలను కలపండి. రొట్టె ముక్కను జోడించడం వల్ల కూడా కారం తగ్గుతుంది. 

click me!