బియ్యానికి పురుగు పట్టొదంటే ఏం చేయాలి?

First Published | Jan 14, 2024, 11:00 AM IST

Kitchen Tips: బియ్యం చాలా రోజులు నిల్వ ఉంటే పక్కాగా పురుగు పడుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే మాత్రం ఎన్ని ఏండ్లైనా మీ ఇంట్లో ఉన్న బియ్యానికి పురుగు అసలే పట్టదు. ఇందుకోసం ఏం చేయాలంటే? 
 

Kitchen Tips:రోజుకు మూడు పూజలా అన్నానే తినే వారు మనదేశంలో చాలా మంది ఉన్నారు. మన ఇంట్లో ఏ ధాన్యాలు ఉన్నా? లేకున్నా? బియ్యం మాత్రం పక్కాగా ఉంటాయి. ఎందుకంటే మన రోజువారి ఆహారం ఇదే కాబట్టి. అందుకే చాలా మంది ఒకేసారి బియ్యాన్ని చాలా కొని పెట్టుకుంటుంటారు. అయితే బియ్యానికి చాలా త్వరగా పురుగులు పడతాయి. గాలి వెళ్లని కంటైనర్ లో నిల్వ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ చాలా మందికి వాటిని నిల్వ చేయడానికి సరైన మార్గం తెలియదు. దీనివల్లే బియ్యానికి పురుగులు పడతాయి. ఇక ఈ పురుగులను ప్రతిరోజూ ఏరాలంటే కుదరకపోవచ్చు. దీనికే చాలా సమయం పడుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ ఇంట్లో బియ్యానికి పురుగులు పట్టే అవకాశమే ఉండదు. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

బిర్యానీ ఆకులు

బిర్యానీ ఆకులను చాలా వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులు వంట రుచిని పెంచడంతో పాటుగా కీటకాల నుంచి బియ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడుతాయి. అవును మీ ఇంట్లో ఉన్న బియ్యంలో పురుగులు ఉంటే.. బియ్యం కంటైనర్లలో కొన్ని బిర్యానీ ఆకులను వేయండి. దీంతో బియ్యంలోంచి పురుగులు బయటకు పోతాయి. అలాగే మీ బియ్యం సంవత్సరం పొడవునా సురక్షితంగా ఉంటాయి.పురుగులు పట్టే ఛాన్సే ఉండదు.


neem leaves

వేప ఆకులు

వేప ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులు రుచిలో చేదుగా ఉండే కీటకాల నుంచి బియ్యాన్ని రక్షించడంలో మాత్రం ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీని కోసం వేప ఎండిన ఆకులను కాటన్ గుడ్డలో కట్టి బియ్యం ఉన్న కంటైనర్ లో పెట్టండి. దీనివల్ల బియ్యంలో ఉన్న కీటకాలన్నీ బయటకు పోతాయి. 

అగ్గిపుల్లలు

అవును అగ్గిపుల్లలు కూడా ఈ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి. మీరు బియ్యాన్ని పురుగులు, ఇతర కీటకాల నుంచి రక్షించాలనుకుంటే.. దానిని నిల్వ చేసే కంటైనర్ లో అగ్గిపుల్లలను ఉంచండి. ఇవి బియ్యం అంతటా ఉండేలా చూసుకోండి. వీటివల్ల కూడా బియ్యంలోకి పురుగులు రావు. ఒకవేళ ఉన్నా పారిపోతాయి.
 

clove

లవంగం

బియ్యంలోని పురుగులను బయటకు పంపడానికి లవంగాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం కొన్ని లవంగాలను తీసుకొని వాటిని బియ్యం ఉన్న కంటైనర్లలో ఉంచండి. దీంతో కీటకాలు, చీమలు రాకుండా ఉంటాయి.
 

వెల్లుల్లి

వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల కూడా బియ్యాన్ని కీటకాల నుంచి రక్షించొచ్చు. వలచని వెల్లుల్లిని బియ్యం ఉన్న కంటైనర్ లో ఉంచండి. కీటకాలు దాని బలమైన వాసన నుంచి పారిపోతాయి.

Latest Videos

click me!