Sankranti 2024: మన దేశంలో సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. రంగురంగుల ముగ్గులను వేయడం, భోగి మంటలు, పిండి వంటలు, నోరూరించే స్వీట్లు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు.. ఇలా చెప్పుకుంటూ సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రేపు మకర సక్రాంతి. అంటే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజును తెలంగాణ, ఆంధ్రపదేశ్, తమిళనాడు, రాష్ట్రాల్లో భోగి పొంగల్ గా జరుపుకుంటారు. భోగి అనే పదం.. ఆహారానికి, ఆనందం సంబంధించినదిగా కూడా భావిస్తారు.