మీలో ముచ్చటైన ‘ముద్దు’ పెట్టే కళ ఉందా?

First Published | Apr 21, 2022, 12:44 PM IST

ముద్దు.. నాలుగు పెదాలు ఆడుకునే ప్రేమాట. అయితే అది వన్ సైడ్ లవ్ లా ఉంటే.. కష్టం. అంటే.. ముద్దు పెట్టడం సరిగా రాకపోతే.. ఎదుటివారు మళ్లోసారి ముద్దంటేనే భయపడతారు. అందుకే మీలో ముద్దును ముద్దుగా, ముచ్చటగా పెట్టే కళ ఉందా.. చూడండి.. 

ముద్దు పెట్టుకోవడం ఒక కళ. ఇది అందరికీ ఒంటపట్టదు. దీనికి ఓ శైలి, అభిరుచి ఉంటుంది. ఇలాంటి వారు ముద్దును ఎంతో ఓపికగా, అందమైన శిల్పం చెక్కినట్టుగా పెడతారు. పెదాలమీద నెమ్మదిగా ముద్దుపెట్టడం అయినా.. నాలుకతో ఆడుకోవడం అయినా వీరి స్టైలే వేరుగా ఉంటుంది. అలా కాకుండా మొరటుగా ముద్దుపెట్టేవారిని ఎవ్వరూ ఇష్టపడరు. ముద్దంటేనే భయపడతారు. మరి మీరు మంచి ముద్దులు పెట్టగలరా? మీలో ముచ్చటైన ఆ ముద్దు కళ ఉందా? ముద్దు పెట్టేప్పుడు అతి మామూలుగా చేసే తప్పులేంటి? వాటని తెలుసుకుని ఈ సారి ముద్దు పెట్టేప్పుడు వీలైనంతవరకు అవాయిడ్ చేస్తే... బెస్ట్ కిస్సర్ మీరే అవుతారు... చూడండి. 

Image: Getty Images

టంగ్ ప్లే...
కొంతమంది ముద్దు పెట్టడం పెట్టడమే నాలుకతో ఆటలాడడం మొదలుపెడతారు. అయితే అది సరికాదు. ముందు పెదాలను లాలించిన తరువాతే నాలుక జోలికి వెళ్లండి. ఏది చేసినా ఫాస్ట్ గా కాకుండా.. నెమ్మదిగా మీ భాగస్వామి కదలికలను.. ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నదాన్ని గమనిస్తూ చేయండి. 


Image: Getty Images

నోట్లో ఎక్కువ లాలాజలం ఉండడం...
ముద్దు సమయంలో నోట్లో ఎక్కువగా లాలాజలం ఉంటే ఇబ్బంది పడతారు. ముద్దు విషయంలో అత్యంత చిరాకైన విషయం ఇదే. అస్సలు సెక్సీగా అనిపించని విషయం ఇదేనట. 

తొందరపడకండి.. 
శృంగారంలో లాగానే ముద్దులో తొందరపాటు అస్సలు కుదరదు. అలాగే చిరాకూ మంచిది కాదు. ముఖ్యంగా భాగస్వామిమీద. ముద్దు అనేది శరీరంలోని హార్మోన్లను ప్రేరేపించి.. శృంగారానికి దారివేసే రాజమార్గం అని మరిచిపోవద్దు. ఒకవేళ ఏ విధంగానైనా ముద్దు పెట్టుకోవడానికి ఆలస్యమైతే మీ భాగస్వామి ఆలస్యాన్ని, పరిస్థితిని, మానసిక స్థితిని అర్థం చేసుకోండి. 

వేరేవాటి గురించి ఆలోచించకండి... 
కొంతమంది ముద్దుపెట్టుకుంటూ వేరే విషయాలమీదికి మనసు మళ్లిస్తారు. అలా ఎప్పుడూ చేయద్దు. మీ మనసు, చూపు అంతా మీ ఎదుటి వ్యక్తి మీదే ఉండాలి. అప్పుడే మీలో శృంగారపరమైన చర్యలు ప్రారంభమవుతాయి. ముద్దు ప్రయోజనాలూ నెరవేరతాయి. 

పెదాలకు సంబంధించింది మాత్రమే కాదు.. 
ముద్దు అంటే పెదాల ఆటే కాదు.. చేతుల సయ్యాట కూడా.. మీ చేతులు మీ భాగస్వామి శరీరం చుట్టూ తిరగనివ్వండి. ముద్దు పెట్టుకునేటప్పుడు, మీ భాగస్వామి పెదవులపై మాత్రమే కాకుండా, వారి మెడ, నడుముపై దృష్టి పెట్టండి. మీరు మీ భాగస్వామి కళ్లలోకి కళ్లుపెట్టి మరింత గాఢంగా కూడా చూడొచ్చు. 

Latest Videos

click me!