మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే సులువైన చిట్కాలు

First Published Dec 11, 2022, 10:57 AM IST

మూత్రపిండాలు మన శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో ఒకటి. దీని పనితీరు ఏ మాత్రం తగ్గినా.. మన ఆరోగ్యంపై చెడు ప్రభావం దారుణంగా పడుతుంది. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 
 

ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వ్యాధి సుమారుగా 1.7 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేస్తోంది. దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్త మరణాల్లో మూత్రపిండాల వ్యాధి ఫస్ట్ నుంచి ఆరో ప్లేస్ లో ఉంది. మూత్రపిండాల వ్యాధి బారిన పడే ప్రమాదముంటే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడేపేలా చూసుకోవాలి. లేదంటే కిడ్నీల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

OTC మాత్రలు వేసుకోవద్దు

ఓవర్ ది కౌంటర్ నొప్పి మందులు, ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ సోడియం వంటి మందులను ఎక్కువగా వేసుకోవడం వల్ల మీ మూత్రపిండాలు నేరుగా దెబ్బతింటాయి. ముఖ్యంగా మీ మూత్రపిండాలు కోలుకోలేని పరిస్థితికి చేరుకుంటాయి. అవసరమైతేనే ఈ మందులు వేసుకోండి. నొప్పి తగ్గడానికి ఎక్కువగా సహజ ఇంటి నివారణ చిట్కాలను ఫాలో అవ్వండని నిపుణులు చెబుతున్నారు. 
 

క్రమంతప్పకుండా వ్యాయామం చేయండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా  ఉంటుంది. అంతేకాదు వ్యాయామం మీ మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం మీరు చేయగలిగే ఉత్తమమైన విషయాలలో ఇదీ ఒకటి. రెగ్యులర్ గా ఎక్సర్ సైజెస్ చేయడం వల్ల మీరు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామం చేయడం ద్వారా శరీర జీవక్రియ పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

క్రమంతప్పకుండా వ్యాయామం చేయండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా  ఉంటుంది. అంతేకాదు వ్యాయామం మీ మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం మీరు చేయగలిగే ఉత్తమమైన విషయాలలో ఇదీ ఒకటి. రెగ్యులర్ గా ఎక్సర్ సైజెస్ చేయడం వల్ల మీరు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామం చేయడం ద్వారా శరీర జీవక్రియ పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 
 

పుష్కలంగా నీటిని తాగండి.. 

మన శరీరంలో నీరే ఎక్కువ భాగం ఉంటుంది. అందుకే రోజూ నీటిని పుష్కలంగా తాగాలి. నీళ్లను ఎక్కువగా తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాల నుంచి సోడియం, విషాన్ని క్లియర్ అవుతాయి. అలాగే మూత్రపిండాల్లోని రాళ్లు తొందరగా తగ్గిపోతాయి. నీరు రక్త నాళాలు తెరవడానికి సహాయపడుతుంది. అలాగే అవసరమైన పోషకాలను పంపిణీ చేసే మూత్రపిండాలకు సమర్థవంతమైన రక్త ప్రసరణను అనుమతిస్తుంది. రోజుకు 1.5 నుంచి2 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి. 

ఆరోగ్యకరమైన జీవన శైలి

ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మూత్రపిండాల వ్యాధిని దూరం చేస్తుంది. మెరుగైన జీవనశైలితోనే ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. జీవితం పట్ల సానుకూల ఆలోచనను కలిగి ఉండండి. పాజిటీవ్ ఆలోచనలే ఎన్నో రోగాలను నయం చేస్తాయి. 
 

ఆరోగ్యకరమైన అలవాట్లు,  ఆహార ఎంపికలు

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న పాడి, తక్కువ సోడియం, తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలనే తినాలి. ఆరోగ్యకరమైన ఆహారంతోనే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇలా చేయడం వల్లే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి. ఎందుకంటే ఇవి రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే మూత్రపిండాల వడపోత ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. 

click me!