శృంగారం శారీరక సుఖం కోసమే కాదు.. ఈ రోగాలు తగ్గిపోతాయి కూడా..!

First Published | Aug 30, 2022, 10:00 AM IST

‘శృంగారం’ అనగానే శరీరక సుఖం అని కొందరికీ అనిపించినా.. ఇది పెళ్లైన వారికి ఓ వరం అనే చెప్పాలి. ఎందుకంటారా... దీనివల్ల బోలెడు లాభాలున్నాయి. తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడటమే కాదు.. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఒత్తిడి, నిద్రలేమి, కాళ్ల నొప్పులు వంటి ఎన్నో శారీరక, మానసిక సమస్యలు తగ్గిపోతాయండోయ్..
 

పెళ్లైన ప్రతి భార్యభర్తల మధ్యన శృంగారం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని.. భయాలను తగ్గించి.. ఇద్దరూ సంతోషంగా, హాయిగా గడిపేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు  భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుతుంది. మీకో విషయం తెలుసా.. ఇది శారీరక సంతోషం కోసమే అని కొందరికి అనిపించినా ... మానసిక ఆనందాన్ని కలగించడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఇది ఎలాంటి సమస్యలను తగ్గిస్తుందో తెలుసుకుందాం పదండి. 
 

ఒత్తిడి తగ్గుతుంది

ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడి సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఈ ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇక ఒత్తిడిని తగ్గించుకోవడాని యోగా చేయాలి.. ధ్యానం చేయాలి.. ఎక్సర్ సైజ్ చేయాలి అంటూ చాలా మంది సలహానిస్తుంటారు. ఇవన్నీ కాదు.. మీ భాగస్వామితో కొద్ది సమయం సెక్స్ లో పాల్గొనండి చాలు.. ఒత్తిడి చిటికెలో తగ్గిపోతుంది. ఎందుకంటే సెక్స్ వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోతాయని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. 
 


గుండెకు మేలు

శృంగారం వల్ల గుండెకెలా మేలు జరుగుతుందని చాలా మందికి డౌట్ రావొచ్చు. కానీ ఇది నిజమంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి రెండే రెండు సార్లు సెక్స్ లో పాల్గొనే వారితో పోల్చితే.. పాల్గొనని వారే గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారట. శృంగారం వ్యాయామంలా పనిచేస్తుంది. అందుకే ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ తరచుగా శృంగారంలో పాల్గొనే వారు మరింత ఆరోగ్యంగా, హుషారుగా ఉంటారు. 
 

శృంగారం ఒక వ్యాయామం

శృంగారంలో పాల్గొంటే మీరు వ్యాయామం చేసినట్టే లెక్క. ఎందుకంటే దీనివల్ల నిమిషానికి 6 కేలరీలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇది శరీరం మొత్తం కదిలేటట్టు నడవటంతో సమానం. అంతేకాదు ఇది మెట్లు ఎక్కడం, స్పీడ్ గా నడవడం వంటి ఎన్నో పనులతో సమానమంటున్నారు నిపుణులు. ఈ సెక్స్ సమయంలో ఆక్సిజన్ ను ఎక్కువగా పీల్చకుంటారు. ఇది మిమ్మల్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. 

మెమోరీ పవర్ పెరుగుతుంది

శృంగారంతో మెమోరీ పవర్ పెరుగుతుంది అంటే నవ్వుతారేమో కానీ.. ఇది ముమ్మాటికీ నిజమంటున్నాయి పలు అధ్యయనాలు. దీనిపై స్పష్టమైన కారణాలు తెలియవు కానీ..మెమోరీ పవర్ మాత్రం పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా శృంగారం వల్ల 50 ఏండ్ల వారిలో మెమోరీ పవర్ బాగా పెరిగినట్టు గుర్తించారు. శృంగారం వల్ల హిప్పోక్యాంపస్ భాగాలు ఉత్తేజితం అవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. 

హాయిగా నిద్రపోతారు

శృంగారంతో నిద్రలేమి సమస్యలు కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొంటే లవ్ హార్మోన్ రీలీజ్ అయ్యి.. భాగస్వామిపై ప్రేమ పెరిగిపోతుంది. ఇది వారి బంధాన్ని బలంగా చేస్తుంది. అంతేకాదు సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి మనసుకు, శరీరానికి హాయిని కలిగిస్తాయి. ఇక ఈ సమయంలో ఇద్దరికీ హాయిగా, గాఢంగా నిద్రపడుతుంది. ఇక ఈ గాఢనిద్రతో శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అంతేకాదండోయ్ ఇది మీ లైఫ్ టైం ను కూడా పెంచుతుంది. 
 

బంధం బలపడుతుంది

వైవాహిక జీవితంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గించడానికి.. వారి జీవితాలను అందంగా, ఆహ్లాదంగా మార్చడానికి సహాయపడుతుంది. పలు పరిశోధనల ప్రకారం..  భార్యాభర్తలు వారానికి ఒకసారైనా సెక్స్ లో పాల్గొంటే వారి జీవితం ఆనందంగా ఉంటుందట. ఇది నిరూపితమైంది కూడా. 
 

ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందది

పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలంటే.. జస్ట్ సెక్స్ లో పాల్గొంటే చాలంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనడం, సురక్షితం కాని సెక్స్ లో పాల్గొంటే మాత్రం ఈ క్యాన్సర్ ప్రమాదం బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

నొప్పులు తగ్గుతాయి

శృంగారం వల్ల నొప్పులు తగ్గుతాయంటే నమ్ముతారా..? కానీ నమ్మాలి. ఎందుకంటే సెక్స్ లో పాల్గొనడం వల్ల  శరీరంలో నొప్పిని తగ్గించే ఎన్నో హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీనివల్ల కాళ్ల నొప్పులు, తలనొప్పి, నడుం నొప్పి వంటి నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

సెక్స్ ఆపేస్తే ఈ సమస్యలు వస్తాయి.. 

వన్స్ సెక్స్ లో పాల్గొనడం ఆపేయడం వల్ల ఆడవారిలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యోనికి సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల సెక్స్ లో ఎప్పుడన్నా పాల్గొంటే విపరీతమైన నొప్పి పుడుతుంది. ఇలాంటి వారికి సెక్స్ లో పాల్గొనాలనిపించదు కూడా. ఇక మగవారి విషయానికొస్తే వారిలో అంగస్తంభన లోపం ఏర్పడుతుంది. 
 

Latest Videos

click me!