కంతారా నటుడు రిషబ్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా?

Published : Oct 22, 2022, 02:36 PM IST

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మారింది. ఇక ఈ సినిమా లో నటించిన  హీరో రిషబ్ శెట్టి స్టార్ గా మారిపోయాడు.

PREV
18
 కంతారా నటుడు రిషబ్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా?
Rishab Shetty Kantara

ప్రస్తుతం ఎవరినోట విన్నా కంతారా సినిమా గురించే వినపడుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మారింది. ఇక ఈ సినిమా లో నటించిన  హీరో రిషబ్ శెట్టి స్టార్ గా మారిపోయాడు. ఆయన గురించి తెలుసుకోవాలని  నెటిజన్లు మరింత ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఆయన లవ్ లైఫ్ కి సంబంధించిన స్టోరీ కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కాగా... రిషబ్ శెట్టి... తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఓసారి చూద్దాం...

28

1. యాక్టర్, డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి... తాను తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది పడితే అది కాకుండా... ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఆయన తింటూ ఉంటారు.ఒకేసారి హెవీ మీల్స్ తీసుకోరు. కావాలంటే...  తక్కువ తక్కువగా ఆహారం... రోజులో ఐదుసార్లు తీసుకుంటారట.

38

2.రిషబ్ శెట్టి.. ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన ప్రతిరోజూ యోగా చేస్తూ ఉంటారు. యోగాలో సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుంటారు. అంతేకాకుండా ప్రాణయామం కూడా చేస్తారు. ఆరోగ్యంగా సరిగా ఉండటానికి యోగా ఎంతో ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతుంటారు.

48

3.ఇక ఆయన తన డేని ప్రతిరోజూ నిమ్మకాయ నీటితో మొదలుపెడతారు. ప్రతిరోజూ ఆయన గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం  పిండి ఆ నీటిని తాగుతూ ఉంటారు. తన డేని వాటితోనే మొదలుపెడతానని ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడం గమనార్హం.

58


4.రిషబ్ తన బ్రేక్ ఫాస్ట్ చాలా సింపుల్ గా ఉండేలా జాగ్రత్త పడతారు. అంటే ఇడ్లీ, దోశ, సాంబార్ వంటివి ఉండేలా చూసుకుంటారు. అవి కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటారట.

68


5. రిషబ్ ట్రెడిషనల్  సౌత్ ఇండియన్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం. దక్షిణాది ఫుడ్స్ ని తినడాన్ని , చేయడాన్ని ఆయన ఎక్కువ ఆస్వాదిస్తారు.

78


6.ఆయన తీసుకునే డిన్నర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన డిన్నర్ ని రాత్రి 8గంటల 30 నిమిషాల లోపే ఆయన డిన్నర్ ని పూర్తి చేస్తారు.

88

7.అంతేకాకుండా... రిషబ్ తన ఆహారంలో ఉడకపెట్టిన కూరగాయలు, టోస్ట్ చేసిన కూరగాయలను ఆయన ఎక్కువగా తింటారు. అంతేకాకుండా ఆయన ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ని ఆహారంలో భాగం చేసుకుంటారట.

click me!

Recommended Stories