ఈ ఫేస్ ప్యకా్ తయారీ ఎంతో సులభంగా ఉంటుంది. దీని కోసం కేవలం ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా రోజ్ వాటర్ సరిపోతాయి. ముందుగా పసుపును తక్కువ మంటపై కాసేపు డ్రై రోస్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత అందులో తేనె, పేస్ట్‌లాగా మారేందుకు తగినంత రోజ్ వాటర్ కలిపితే ఈ ఫేస్ మాస్క్ సిద్ధమవుతుంది. ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కళ్లు, పెదవులను వదిలి మిగతా ముఖమంతా ఈ మిశ్రమాన్ని పలుచగా పూయాలి. సుమార పావుగంట సేపు ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. పసుపులోని శక్తివంతమైన కుర్కుమిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మ కణాలను కాపాడుతుంది. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఎరుపుదనం, మంటను తగ్గించి తక్షణ మెరుపును అందిస్తాయి.