
సీజన్ పండ్లను అస్సలు మిస్ కాకూడదని.. వీటిని ఖచ్చితంగా తినాలని చాలా మంది చెబుతుంటారు. ఈ వేసవిలో మామిడి పండ్లతో పాటుగా నేరేడు పండ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే చాలా మంది మామిడి పండ్లను తిన్నంతగా నేరేడు పండ్లను మాత్రం తినరు. ఎందుకంటే మామిడి పండ్ల మాదిరిగా ఇవి అంత తియ్యగా ఉండవు. ముఖ్యంగా కాస్త వగరుగా ఉంటాయి. అందుకే వీటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి ప్రయోజనాలు తెలిస్తే వీటిని తినకుండా అస్సలు ఉండరు తెలుసా.. అవేంటో తెలుసుకుందాం పదండి..
ఈ నేరేడు (Jamun) పండులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి6, నియాసిన్, రైబోఫ్లేవిన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి.
దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక (Immunity)శక్తిని పెంచుతుంది. అంతేకాదు ఈ పండు మధుమేహులకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఈ పండును తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
మధుమేహులు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే నేరేడు పండును తింటే ఈ సమస్య తగ్గుతుంది. అలాగే దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యస్థకు మేలు చేస్తుంది. ఇది Metabolism రేటు పెరగడానికి సహాయపడుతుంది.
నేరేడు పండ్లను తినడం వల్ల వర్షాకాలంలో సోకే వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను సైతం ఇది తగ్గించగలదు.
నేరేడు పండలో ఐరన్ (Iron)పుష్కలంగా ఉంటుంది. ఇది మన బాడీలో హిమోగ్లోబిన్ (Hemoglobin)ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.
నేరేడు పండులో పోటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్.. ఇతర గుండె జబ్బు (Heart disease)ల నుంచి మనల్ని కాపాడుతుంది. అంతేకాదు ఈ పండులో రక్తాన్ని శుద్ది చేసే కారకాలు కూడా ఉంటాయి.
అధిక రక్తపోటు (High blood pressure) పేషెంట్లకు నేరేడు పండ్లు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తాయి. నేరేడు పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అంతేకాదు ఈ పండును తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించవు కూడా. అలాగే ముఖంపై ఏర్పడ్డ ముడతలను సైతం ఇవి తొలగించడానికి సహాయపడతాయి.
నేరేడు పండ్లు దంతాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపతాయి. చిగుళ్ల వాపు వంటి సమస్యలకు తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
నేరేడు పండే కాదు దీని విత్తనం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని విత్తనం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఈ విత్తనాన్ని ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్ చేసి తీసుకోవాలి.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నేరేడు పండు కూడా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అది కూడా మోతాదుకు మించి తిన్నప్పుడు. అందుకే వీటిని పరిమితిలోనే తినండి. లేకపోతే జీర్ణ సమస్యలు, శ్వాస సమస్యలు, రక్తపోటు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.