Gas Stove: గ్యాస్ స్టవ్‌కు ఈ వస్తువులు దగ్గరలో ఉంచితే చాలా డేంజర్

Published : Nov 18, 2025, 04:38 PM IST

Gas Stove:  ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ వాడకం తప్పనిసరి. చాలా మంది ఆ స్టవ్ చుట్టూ ఎన్నో వస్తువులు పెట్టేస్తూ ఉంటారు. కొన్ని వస్తువులు గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టడం మంచిది కాదు. ఎలాంటి వస్తువులు స్టవ్ చుట్టూ పెట్టకూడదో తెలుసుకోండి.

PREV
16
గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడని వస్తువుల

వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు.  అన్ని రకాల వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టడం సురక్షితం కాదు. మీరు కొన్ని రకాల వస్తువులను స్టవ్ చుట్టూ పెడితే వెంటనే వాటిని తీసేయండి. ఇది చాలా ప్రమాదకరం.

26
వంట నూనె

వంటకు వాడే నూనెను గ్యాస్ స్టవ్ పక్కన పెడుతూ ఉంటారు. స్టవ్ పక్కన పెట్టడం వల్ల  వేడి  నిరంతరం తగలడం వల్ల ఆ నూనె త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. దీనివల్ల నూనె రుచి, నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

36
మసాలా దినుసులు

వంటల్లో వాడే మసాలా దినుసులను కూడా  గ్యాస్ స్టవ్ పక్కన పెట్టేవారు ఎంతో మంది.  స్టవ్ నుంచి నిరంతరం వేడి తగిలినప్పుడు వాటి ఆకృతిలో, రుచిలో మార్పులు వస్తాయి. మసాలా దినుసులను వంటగది షెల్ఫ్‌లో పెట్టడం మంచిది. స్టవ్ కు దూరంగా ఉంటే మంచిది.

46
టిష్యూ పేపర్

టిష్యూ పేపర్‌ను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టే అలవాటు మానుకోండి. దీనివల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగినా  మంటలు అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గ్యాస్ స్టవ్‌కు దూరంగా పెట్టేలా చూసుకోండి.

56
ఎలక్ట్రిక్ వస్తువులు

గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే అధిక వేడి వల్ల ఎలక్ట్రిక్ వస్తువులు త్వరగా పాడవుతాయి. అందుకే ఇలాంటి వస్తువులను ఎప్పుడూ గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు.

66
కూరగాయలు

త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు. ఎక్కువ వేడి లేదా వెలుతురు లేని చోట వీటిని ఉంచాలి. కూరగాయలు, పండ్లను గది ఉష్ణోగ్రతలో పెట్టవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories