relationship: మీ రిలేషన్ షిప్ సేఫా ? కాదా? ఇలా తెలుసుకోండి..

First Published | Feb 28, 2022, 1:47 PM IST

relationship: రిలేషన్ షిల్ లో ఉండటం సులభమే కానీ ఒక బంధాన్ని ఎల్లకాలం నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం.  అందుకే కదా.. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎక్కువ కాలం నిలబడటం లేదు. అయితే మీ మధ్యనున్న రిలేషన్ షిప్ సేఫా? కాదా? అన్న విషయాలను ఎలా చెక్ చేయాలో తెలుసా..

 ఒక రిలేషన్ షిప్ స్ట్రాంగా ఉండాలంటే వారిద్దరి మధ్యన కొన్ని విషయాల్లో స్పష్టత ఎంతో అవసరం. అది లేకుంటేనే మీ రిలేషన్ షిప్ బ్రేకప్ గా మారుతుంది. అయితే మీ రిలేషన్ షిప్ లో స్పష్టత ఉందో లేదో కొన్ని విషయాల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి అవేంటో చూద్దాం పదండి..

ఇష్టాయిష్టాలు: ఇరువురి మధ్య బంధం బటపడితేనే ఆ రిలేషన్ షిప్ లో ఎలాంటి గొడవలొచ్చినా బ్రేకప్ అవ్వదు. మరి బంధం బలపడాలంటే మీ పార్టనర్ ఇష్ట ఇష్టాలను, అయిష్టాలను, అభిరుచులను తెలుసుకోవాలి. వారి గురించి ప్రతీది తెలుసుకున్నప్పుడే మీ రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. 


ఫ్యూచర్ ప్లాన్స్: మీ జీవితం సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ప్రయాణించాలన్నా ఒకరికొరకు వారి ఫ్యూచర్ ప్లాన్స్ ను షేర్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. మొహమాట పడకుండా మీ భాగస్వామికి మీ లక్ష్యాలను తెలియజేయండి. ఇలా చెప్పుకోవడం వల్ల మీ ఫ్యూచర్ లక్ష్యాలపై ఒక క్లారిటీ ఉంటుంది. మధ్యలో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. 

మనస్పర్థలు: రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనస్పర్థలు, చిన్న చిన్న గొడవలు రావడం చాలా సహజం. కానీ ఎవరికి వారు తగ్గకుండా సారీలు చెప్పుకుని కలవక పోతే మాత్రం అది మీరు విడిపోయే దాకా వెలుతుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవడం ఉత్తమం. 
 

డెసిషన్స్: మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ భాగస్వామితో కూడా చర్చించండి. కలిసి నిర్ణయం తీసుకుంటేనే రిలేషన్ షిప్ లో ఎలాంటి ఇబ్బందులు రావు.

రియాక్షన్:  రిలేషన్ షిప్ లో గొడవలు, చిన్న చిన్న కొట్లాటలు చాలా కామన్. అయితే ఆ సమయంలో మీ భాగస్వామి ఎలా రియాక్ట్ అవుతున్నాడో గమనించాలి. ఒక వేళ మీ పార్టనర్ దానికి పాజిటీవ్ యాటిట్యూడ్ తో రియాక్ట్ అయితే ఆ వివాదాలను పరిష్కరించుకోవాలి. 
 

ఫైనాన్షియల్ విషయాలు: భార్య భర్తల మధ్యన డబ్బుల విషయంలోనే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఫైనాన్స్ విషయమైనా ఒకరికి ఒకరు చెప్పుకోవాలి. కలిసి జీవిస్తున్నప్పుడు ఆర్థిక విషయాలను పంచుకోవడం ఎంతో ముఖ్యం.

Image: Getty Images

పిల్లల గురించి: పిల్లల చదువు, వారి ఫ్యూచర్ గురించి భార్యా భర్తకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అభిప్రాయాలు లేకుండా పిల్లల భవిష్యత్తులకు ఏది మంచిదో, ఏది చెడో చర్చించండి. లేదంటే మీ పిల్లల భవిష్యత్తు కు నష్టం కలగొచ్చు. 

ఐదేళ్ల తర్వాత: మీ పెళ్లి అయ్యి ఐదేండ్ల తర్వాత మీరిద్దరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ భాగస్వామికి చెప్పండి. దీనివల్ల మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మీ ఫ్యూచర్ ప్లాన్ ను చేరుకుంటారు. 

Latest Videos

click me!