ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాన్ని తీసుకుంటే తల్లితో పాటు కడుపులో ఉండే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే వైద్యులు కూడా పోషకవిలువలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని సూచిస్తుంటారు.
అయితే గర్భంతో ఉన్నప్పుడు చాలా మంది వెయిట్ పెరుగుతుండటం కామన్. కానీ ఈ ఓవర్ వెయిట్ వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఓవర్ వెయిట్ ను తగ్గించుకోవాలి. డెలివరీ తర్వాత బరువు తగ్గాలనుకునే వారికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారు.
క్రాష్ డైట్ వద్దు.. క్రాష్ డైట్ లో చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలను తినడమన్న మాట. ఈ డైట్ పాటిస్తే వీలైనంత తొంరగా బరువు తగ్గుతారు. అయితే డెలివరీ తర్వాత మీ బాడీ రికవరీ కావడానికి పోషకాలు మెండుగా ఉండే ఆహారం ఎంతో అవసరం. అలాగే మీరు బిడ్డకు పాలు ఇస్తున్నట్టైతే.. మీ బాడీకి ఎక్కువ కేలరీలు అవసరం. ఎందుకంటే తక్కువ కేలరీలు ఉండే ఆహార పదార్థాల్లో పోషకాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. దాంతో మీరు మరింత అలసిపోతారు.
fiber
ఫైబర్ ఫుడ్: ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండే ఆహార పదార్థాలు కూడా మీరు బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి.Soluble Fiber Foods వల్ల Digestion లేట్ గా అవుతుంది. అంతేకాదు ఈ ఫుడ్స్ ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ లెవెల్స్ తగ్గేలా చేస్తాయి. వీటివల్ల మీకు ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగానే అనిపిస్తుంది. దాంతో మీరు మళ్లీ మళ్లీ తినలేరు. దీనివల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు.
ప్రోటీన్స్: శరీర ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. అందుకే మీ రోజు వారి ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఆహారాలను తీసుకోండి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అంతేకాదు ఆకలి కూడా తగ్గుతుంది. కేలరీలను కూడా తగ్గిస్తుంది. ఎలా అంటే ఇతర ఆహారాలను తీసుకుంటే అవి డైజెస్ట్ అవడానికి ఎనర్జీ ఎక్కువగా ఉపయోగించబతుంది. దీనివల్ల కూడా కేలరీలు బర్న్ అవుతాయి. మెరుగైన ఆరోగ్యానికి గుడ్లు, తక్కువ మెర్క్యూరీ ఉన్న చేపలు, సీడ్స్, లీన్ మీట్, నట్స్ , లెగ్యూమ్స్ ఎంతో అవసరం. వీటిల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
హెల్తీ స్నాక్స్: ఆకలి అయినప్పుడు బయట దొరికే స్నాక్స్ బదులుగా ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినొచ్చు. అందులోనూ ఆరోగ్యకరమైన స్నాక్స్, పెరుగు, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, గ్రానోలా ను ఇంట్లోనే తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి వల్ల మీరు వెయిట్ పెరుగే ఛాన్సే లేదు.
ప్రాసెస్డ్ ఫుడ్స్: ప్రాసెస్ ఫుడ్ ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. వీటిలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే ఉప్పుు, కేలరీలు, Unhealthy fats ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మీరు బరువు పెరిగేలా చేస్తాయి కానీ తగ్గించడానికి కాదు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, కుకీలు, స్వీట్స్, చిప్స్ , ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉంటేనే మీరు తొందరగా బరువు తగ్గుతారు.
ఎక్సర్‌సైజ్: కేలరీలు బర్న్ అవ్వడానికి సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు వీటిని క్రమం తప్పకుండా చేయడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా.. ప్రతిదినం ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. ఒక్క ఎక్సర్‌సైజ్ లే కాదు పోషకాహారం తీసుకున్నప్పుడే మీరు వెయిట్ తగ్గుతారు.
బరువు తగ్గేందుకు తగినంత నిద్ర తో పాటుగా, శరీరానికి కావాల్సిన నీరు ఉండాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి అప్పుడే ఈజీగా బరువు తగ్గుతారు.