మీరు వాడే వంటనూనెలు మంచివేనా? కల్తీని గుర్తించడం ఎలా?

First Published Sep 11, 2021, 4:16 PM IST

ఇంట్లో మనం వాడుతున్న నూనె కల్తీదో కాదో ఎలా తెలుసుకోవాలి? అనే విషయం మీద ఎఫ్ఎస్ఎస్ఎఐ కొన్ని మార్గదర్శకాలు చెబుతోంది. వీటిని బట్టి మీరు వాడుతున్న నూనె కల్తీదో కాదు తెలుసుకోవచ్చని చెబుతున్నారు. 

నేటి రోజుల్లో ప్రతీ విషయంలోనూ కల్తీ కామన్ అయిపోయింది. ఇక తినే ఆహార పదార్థాల్లో కల్తీ ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో తెలిసినా కూడా కల్తీ చేయడం ఆగడం లేదు. ముఖ్యంగా వంటనూనెల్లో ప్రమాదకరమైన మెటానిల్ ఎల్లో అనే నిషేధిత రంగును వాడుతున్నారు. దీన్ని తెలియకుండా వాడడం వల్ల ఆరోగ్యాన్ని ప్రమాదాల బారిన పడేస్తున్నాం. 

మరి దీన్ని ఎలా కనిపెట్టాలి? ఇంట్లో మనం వాడుతున్న నూనె కల్తీదో కాదో ఎలా తెలుసుకోవాలి? అనే విషయం మీద ఎఫ్ఎస్ఎస్ఎఐ కొన్ని మార్గదర్శకాలు చెబుతోంది. వీటిని బట్టి మీరు వాడుతున్న నూనె కల్తీదో కాదు తెలుసుకోవచ్చని చెబుతున్నారు. 

వంటనూనెల కల్తీని చెక్ చేయడానికి ఐదు దశల ప్రక్రియను వారు సూచిస్తున్నారు. అదెలాగంటే.. 

- ముందుగా ఒక టెస్ట్ ట్యూబ్‌లో 1 ఎంఎల్ నూనెను తీసుకోండి.
- దీనికి 4 ఎంఎల్ డిస్టిల్డ్ వాటర్ కలిపి టెస్ట్ ట్యూబ్‌ను బాగా షేక్ చేయాలి.
- ఆ తరువాత ఈ మిశ్రమాన్ని 2 ఎంఎల్ మరొక టెస్ట్ ట్యూబ్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి 2l గాఢమైన హెచ్ సిఎల్ ని కలపాలి.
- ఇప్పుడు కల్తీ లేని నూనె అయితే ఈ మిశ్రమం పై పొర రంగు యధాతథంగా ఉంటుంది. 
- అదే మీరు వాడుతున్న నూనె కల్తీ అయితే నూనె పై పొర రంగు మారుతుంది. 

మెటానిల్ ఎల్లో ఎందుకంత ప్రమాదకరం.. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటీ అంటే.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెటానిల్ ఎల్లో అనేది మన దేశంలో విస్తృతంగా వాడుతున్నారు. అయితే దీనికి అలా వాడే అనుమతి లేదు. నిషేధించబడింది. 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, మెటానిల్ ఎల్లో మనుషులు వాడడానికి పనికిరాదు. ఫుడ్ కెమిస్ట్రీ, టాక్సికాలజీ జర్నల్ జనవరి 1993 లో నిర్వహించిన జంతు అధ్యయనం ప్రకారం, మెటానిల్ ఎల్లో దీర్ఘకాలిక వినియోగం వల్ల మెదడులోని సెరోటోనిన్, డోపామైన్, నోరాడ్రినలిన్ స్థాయిల మధ్య లింక్ ఉంది. ఇది మెదడు విషయాలను అర్థం చేసుకునే, గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

FSSAI చేసిన ట్వీట్ ప్రకారం, హెచ్ సిఎల్ యాసిడ్ నిషేధిత రంగును, మెటానిల్ ఎల్లో వంటి కల్తీ నూనె నమూనా నుండి సంగ్రహిస్తుంది.  అందుకే కల్తీ అయితే యాసిడ్ పొర రంగు మారిపోతుంది. అయితే స్వచ్ఛమైన నూనె రంగులో ఎలాంటి మార్పు ఉండదు.  

click me!