రష్మిక మందన బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఫాలో అయితే మెరిసే అందం మీ సొంతం..

First Published Sep 11, 2021, 1:57 PM IST

రష్మిక మందన నాచురల్ బ్యూటీ. అయినా కూడా చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. నాచురల్ గా అందంగా కనిపించడం కోసం ఎంతో శ్రమిస్తుంది. బ్యూటీ కోసం పైనుంచి రాసే క్రీములు, లోషన్లు, మేకప్ లే కాదు... ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలంటారామె. 

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ రష్మిక మందన్న.. కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. పెద్ద హీరోల సరసన చాన్స్ లూ కొట్టేసింది. అయితే రష్మిక తన బ్యూటీని మెయింటేన్ చేయడం కోసం.. చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ బ్యూటీ సీక్రెట్స్ ఏంటే చూద్దాం. 

చక్కటినువ్వు, గుచ్చుకునే చూపులు.. అందమైన ఆహార్యం. అంతకు మించి నటన.. ఒక హీరోయిన్ కు ఇంతకంటే కావాల్సిందేముంది. అందుకే రష్మిక మందన అందరి హృదయాల్నీ కొల్లగొట్టింది. 

రష్మిక మందన నాచురల్ బ్యూటీ. అయినా కూడా చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. నాచురల్ గా అందంగా కనిపించడం కోసం ఎంతో శ్రమిస్తుంది. బ్యూటీ కోసం పైనుంచి రాసే క్రీములు, లోషన్లు, మేకప్ లే కాదు... ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలంటారామె. 

తన చర్మ సంరక్షణ, అందంకోసం రష్మిక అలర్జీ టెస్ట్ చేయించుకుందట. తన శరీరానికి ఎలాంటి ఆహారాలు పడతాయి, ఎలాంటి వాటితో ఎలర్జీ వస్తుందనేది ముందు టెస్టు ద్వారా తెలుసుకుని ఆ తరువాత దాన్నే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యిందట. దీనివల్లే తన చర్మం అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోతుందని చెబుతుంది ఈ బ్యూటీ. 

అలాగే తినే విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది రష్మిక. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, చర్మానికి హాని చేసే ఆహారాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటుంది. సన్ స్క్రీన్ లోషన్ లేకుండా ఇంట్లోనుంచి అడుగు బైటికి పెట్టదట. 

అంతేకాదు చర్మ సౌందర్యం కోసం.. రష్మిక మందన క్రమం తప్పకుండా విటమిన్ సి సీరమ్ ను వాడుతుంది. దీనివల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా.. చర్మం నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా తయారవుతుంది. 

చర్మానికి మాయిశ్చరైజర్ ను మించిన మంచిది లేదంటుంది రష్మిక. మేకప్ వేసుకునేముందు.. తీసిన తరువాత మాయిశ్చరైజర్ రాయడం చాలామంది దాటేస్తుంటారు. అయితే అది మంచిది కాదంటుంది రష్మిక. తప్పనిసరిగా మాయిశ్చరైజర్ వాడాలని చెబుతోంది.

ఇక ముఖం పొడి బారకుండా ఉండాలంటే మరో అద్భుతమై చిట్కా చెబుతుంది రష్మిక. ముఖాన్ని పదే పదే కడగం అంత మంచిది కాదంటుంది. రోజులు రెండుసార్లకు మించి ముఖాన్ని కడగొద్దని చెబుతోంది. పదే పదే కడగడం వల్ల చర్మం మీది తేమ తగ్గిపోయి పొడిబారిపోతుందని చెబుతోంది. 

click me!