కారంపొడిలో కల్తీని ఇలా కనిపెట్టండి..

First Published | Sep 30, 2021, 3:41 PM IST

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్‌లో #DetectingFoodAdulterents అనే సిరీస్‌ను ప్రారంభించింది. దీంట్లో భాగంగా రోజువారీ ఆహారపదార్థాల్లో కల్తీని ఇంట్లోనే చిన్న టెస్ట్ తో తెలుసుకోవచ్చు. అలా ఈ రోజు కారంపొడిలో కల్తీ జరిగిందో లేదో.. ఎలా తెలుసుకోవాలో చూద్దాం. 

ఆహార కల్తీ అలవాటు దశాబ్దాలుగా ఉంది. రోజువారీ ఆహార పదార్థాలలో కల్తీ పదార్థాలను గుర్తించడంలో తరచుగా వినియోగదారులు విఫలమవుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావం కలుగుతుంది. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యమో.. కల్తీ మీద అవగాహన కూడా అంతే ముఖ్యం.

దీనికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్‌లో #DetectingFoodAdulterents అనే సిరీస్‌ను ప్రారంభించింది. దీంట్లో భాగంగా రోజువారీ ఆహారపదార్థాల్లో కల్తీని ఇంట్లోనే చిన్న టెస్ట్ తో తెలుసుకోవచ్చు. అలా ఈ రోజు కారంపొడిలో కల్తీ జరిగిందో లేదో.. ఎలా తెలుసుకోవాలో చూద్దాం.  


ప్రతీ వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే మసాలా దినుసు కారంపొడి. కారంపొడి వంటలకు సరైన కారాన్ని జోడించడంతో పాటు.. రుచిని ఇస్తుంది. సరైన మోతాదులో కారాన్ని తీసుకోవడం  శరీరానికీ మంచిది. 

అయితే, కారం ఈజీగా కల్తీ చేయచ్చు. ఇది తరచుగా ఎర్ర ఇటుక పొడి, ఊకలు కలిపి కల్తీ చేయబడుతుంది. షాకింగ్ గా అనిపిస్తుందా? అయినా, ఇది నిజం. మరి మీరు వాడే కారం పొడి కల్తీదో కాదో తెలుసుకోవడం ఎలా..? అంటే ఇంట్లోనే ఈజీగా ఒక చిట్కాతో కనిపెట్టవచ్చు అని FSSAI చెబుతోంది. 

దీనికోసం మూడు దశల పరీక్ష చేయాలి.. 
ముందు.. 
దశ 1. ఒక గ్లాసు నీరు తీసుకోవాలి..
దశ 2. దానికి ఒక టీస్పూన్ కారం పొడి కలపాలి...
దశ 3. ఇప్పుడు నీటిలో కరిగిన రెసిడ్యూను పరిశీలంచండి. కొద్ది మొత్తంలో అవశేషాలను తీసుకొని చేతిలో రుద్దాలి.. రుద్దిన తర్వాత ఏవైనా దురద అనిపిస్తే, కారం పొడిలో ఇటుక పొడి/ఊకతో కల్తీ జరిగిందని అర్థం. కాస్త నురగ వచ్చి...స్మూత్ గా ఉన్నట్టు అనిపిస్తే, అందులో సబ్బుఅవశేషాలు కలపినట్టు. 

Latest Videos

click me!