Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి

Published : May 21, 2026, 06:20 PM IST

Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోవడానికి  స్టవ్ బర్నర్లు కూడా కారణమే. బర్నర్లు మూసుకుపోతే, మంట సరిగ్గా రాదు. దీనివల్ల వంటకు ఎక్కువ సమయం పడుతుంది, గ్యాస్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. గ్యాస్ బర్నర్లను  సులువుగా శుభ్రం చేసే పద్ధతి తెలుసుకోండి.

PREV
14
గ్యాస్ వేస్ట్ కాకుండా...

యుద్ధాల వల్ల వంట గ్యాస్ కొరత వచ్చేసింది.  పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో గ్యాస్ ను వేస్ట్ కాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి. బర్నర్లు సరిగ్గా శుభ్రం చేయకపోతే వంటకు ఎక్కువ సమయం పడుతుంది. అదే సమయంలో, గ్యాస్ కూడా చాలా వృథా అవుతుంది. గ్యాస్ బర్నర్లను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుంటే గ్యాస్ వేస్ట్ కాకుండా కాపాడుకోవచ్చు.

24
స్టవ్ బర్నర్‌లను శుభ్రపరిచే పద్ధతులు

గ్యాస్ స్టవ్ బర్నర్లలో మురికి, నూనె జిడ్డు పేరుకుపోతే వాటి రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల గ్యాస్ ఆ రంధ్రాల నుంచి సరిగ్గా బయటకు రాదు. వచ్చే చిన్న మంటతోనే వంట చేయాలి. దీని వల్ల వంటకు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది. బర్నర్లను తరచుగా శుభ్రం చేస్తే, ఈ అడ్డంకులు తొలగిపోయి మంట బాగా వస్తుంది. నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి బర్నర్లను శుభ్రం చేసుకోవాలి.

34
ఈనోతో బర్నర్ శుభ్రం

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. ఇందులో ఒక నిమ్మకాయ రసం, ఈనో పౌడర్‌ను వేసి కలపాలి. అప్పుడు నీళ్లు సోడాలా పొంగుతాయి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిశ్రమంలో బర్నర్లను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం చూస్తే, నీళ్ల రంగు మారిపోయి ఉంటుంది. బర్నర్‌లోని మురికి, జిడ్డు అంతా పోయి శుభ్రంగా కనిపిస్తాయి. తర్వాత బర్నర్లను బయటకు తీసి మామూలు నీటితో కడిగేయాలి. 

44
బేకింగ్ సోడాతో

ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఇందులో రెండు నుంచి మూడు చెంచాల బేకింగ్ సోడా, కొద్దిగా డిష్‌వాష్ సోప్ కలపాలి. దీనిలో నిమ్మరసం కూడా వేయాలి. ఈ ద్రావణంలో బర్నర్‌ను కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత పాత టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి మొత్తం పోతుంది. తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, పొడి బట్టతో తుడిచి, పూర్తిగా ఆరనివ్వాలి.  

Read more Photos on
click me!

Recommended Stories