Helmet: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా? బట్టతలకు కూడా హెల్మెటే కారణమా?

Published : May 21, 2026, 03:54 PM IST

Helmet: బైక్, స్కూటీ మీద ప్రయాణిస్తున్నప్పుడు మన సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ, చాలా మంది జుట్టు ఎక్కడ రాలిపోతుందో అని భయంతో హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా? 

PREV
13
Helmet

ట్రాఫిక్ రూల్స్ కేవలం మన సేఫ్టీ కోసమే పెడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటే హెల్మెట్ ధరించడం. బైక్ లేదా స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. చాలా ప్రామాదాల్లో హెల్మెట్ కారణంగా ప్రాణాలతో బతికి బయటపడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ, ప్రతిరోజూ హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోతుందనే భయం ఎక్కువ మందిలో ఉంటుంది.చిన్న వయసులోనే బట్టతల రావడానికి కారణం కూడా హెల్మెట్ అనే అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా యువత.. ఎంత దూరం ప్రయాణించినా.. హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. మరి నిపుణులు ఏమంటున్నారు..? నిజంగానే హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వచ్చేస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం...

23
నిపుణులు ఏమంటున్నారంటే...

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల ప్రకారం, హెల్మెట్ ధరించడం వల్ల హెయిర్ ఫాల్ జరగదు. హెల్మెట్ సరిగా శుభ్రం చేయకుండా వాడటం వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ అవుతుందని, లేకపోతే జరగదని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో బట్టతల రావడానికి ఆండ్రోజెనిక్ అలోపేసియా లేదా మేల్ ప్యాటర్న్ బాల్డనెస్ కారణం అని హెల్త్ లైన్ అని చెబుతోంది. అంతేకాదు.. ఫ్యామిలీ డీఎన్ఏ వల్ల కూడా బట్టతల వస్తుంది. అంతేకానీ.. తల మీద ధరించే హెల్మెట్ కారణంగా బట్టతల రాదు అని నిపుణులు చెబుతున్నారు.

‘ హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలదు. జుట్టు రాలడానికి హార్మోన్ల మార్పులు ఒక ప్రధాన కారణం. అదేవిధంగా, మహిళల్లో థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. దీనికి నేరుగా హెల్మెట్ ని నిందించడం కరెక్ట్ కాదు’ అని ముంబయికి చెందిన స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ షరీఫా చౌజ్ చెప్పారు. అంతేకాదు.. మహిళలు పోనీటెయిల్స్ లాంటి హెయిర్ స్టైల్స్ వేసుకొని హెల్మెట్ పెట్టుకుంటే.. అప్పుడు జుట్టులో రాపిడికి జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

‘ టైట్ గా ఉండే హెల్మెట్ ధరించడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. హెల్మెట్ టైట్ గా ఉంటే.. చెమట పట్టడం, దురద లాంటి సమస్యలు వస్తాయి. హెల్మెట్ సరైన సైజ్ లేకపోయినా, దానిని సరిగా శుభ్రం చేయకపోయినా హెయిర్ డ్యామేజ్ అవుతుంది తప్ప.. కేవలం హెల్మెట్ ధరించడం వల్ల బట్టతల రాదు’ అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఎక్కువ సేపు హెల్మెట్ ధరించడం వల్ల తలలో చెమట పోస్తుంది. దీని తర్వాత.. సరిగా హెయిర్ వాష్ చేయకపోతే.. అప్పుడు జుట్టు పాడౌతుంది.

33
హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

హెల్మెట్ ధరించేటప్పుడు మీ జుట్టును కాపాడుకోవడానికి, ముందుగా మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా లేని సరైన సైజు హెల్మెట్‌ను ఎంచుకోండి. హెల్మెట్ పెట్టుకునే ముందు, చెమటను పీల్చుకోవడానికి మీ తల చుట్టూ శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని లేదా స్కార్ఫ్‌ను కట్టుకోండి.

అలాగే, మీ హెల్మెట్ లోపలి భాగాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోండి. తడి జుట్టుతో హెల్మెట్ అస్సలు ధరించవద్దు. దీని వల్ల హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories