Chicken skin: నాన్ వెజ్ ప్రియులకు చికెన్ చాలా ఇష్టం. చాలా మంది స్కిన్ తో కూడిన చికెన్ తినేందుకు ఇష్టపడతారు. కానీ చికెన్ స్కిన్ తో తినడం వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి అవగాహన లేదు. చికెన్ స్కిన్ వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
నాన్ వెజ్ ప్రియులు అధికంగా తినేది చికెన్ వంటకాలే. ఎంతోమందికి ఇష్టమైన ఆహారాలన్నీ చికెన్‌తోనే తయారవుతాయి. ఇక గ్రిల్ చేసిన చికెన్ అంటే పడి పడి తింటారు. గ్రిల్ చేసిన చికెన్‌లో పైన ఉన్న స్కిన్ తీయకుండా వండుతారు. అలాగే చాలామంది కూడా ఇంటిదగ్గర స్కిన్ తోనే చికెన్ ముక్కలను వండి తింటారు. ఇలా చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి మంచిదా? లేకపోతే ప్రమాదకరమా? అనే సందేహం మాత్రం ఎంతో మందిలో ఉంది. నిపుణులు చెబుతున్న ప్రకారం చికెన్ స్కిన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో కొవ్వు శాతం విపరీతంగా ఉంటుంది. అది సాచురేటెడ్ ఫ్యాట్. చికెన్ స్కిన్‌ను అధికంగా తింటే శరీరానికి ఈ కొవ్వు హానికరంగా మారుతుంది. ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి తింటే పెద్దగా సమస్య కాకపోవచ్చు.. కానీ తరచూ తినే అలవాటు ఉంటే వెంటనే మానేయడం ఉత్తమం.
24
ఎలాంటి సమస్యలు వస్తాయి?
చికెన్ స్కిన్ తినడం వల్ల ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇందులో ఉండే అధిక కొవ్వు రక్తంలో చేరిపోయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చేస్తాయి. అలాగే బీపీ కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు చికెన్ స్కిన్ తినకూడదు.
34
బరువు పెరుగుతారు
చికెన్ స్కిన్ ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరిగిపోతారు. ఇక ఫాస్ట్ ఫుడ్2లో ఉండే ఫ్రైడ్ చికెన్‌లో స్కిన్ నూనెను అధికంగా పీల్చేస్తుంది. అప్పుడు దాన్ని తినడం వల్ల కేలరీలు రెట్టింపు స్థాయిలో శరీరంలో చేరుతాయి. ఇది ఊబకాయానికి కారణం అవుతుంది. అధిక బరువు వల్ల డయాబెటిస్, థైరాయిడ్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి. కాబట్టి వీలైనంత వరకు చికెన్ స్కిన్ ను తినకపోవడమే ఉత్తమం.
అలాగని చికెన్ స్కిన్ పూర్తిగా నిషేధిత పదార్థం అని చెప్పడం లేదు. అప్పుడప్పుడు గ్రిల్ లేదా బ్రేక్ చేసిన చికెన్ స్కిన్ తింటే పర్వాలేదు.. ప్రతివారం తినే అలవాటు ఉంటే మానుకోండి. రెండు మూడు నెలలకు ఒకసారి తింటే పెద్దగా సమస్య రాదు. అయితే పిల్లలు, వృద్దులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి మాత్రం చికెన్ స్కిన్ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు.