Fan Tricks: ఫ్యాన్ గాలి వేడిగా వస్తుందా? ఇదొక్కటి చేస్తే... ఏసీ ని మించిన చలి..!

Published : Apr 16, 2026, 06:12 PM IST

Fan Tricks: బయట ఎండలకు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నారా? ఫ్యాన్ గాలి కూడా వేడిగా ఉంటుందా? అయితే, ఈ చిన్న చిట్కాలతో రూమ్ ని చల్లగా మార్చుకోవచ్చు.  ఏసీ లేకపోయినా మీ రూమ్  చల్లగా మారుతుంది 

PREV
13
Cooling room

రోజు రోజుకీ బయట ఎండలు మండిపోతున్నాయి.ఈ ఎండలకు ఫ్యాన్ గాలి కూడా సరిపోదు. వెంటనే.. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెడతాం. కానీ, ఫ్యాన్ నుంచి కూడా వేడి గాలే వస్తుంది. గదిలోని వేడి గాలి బయటకు వెళ్లే దారి లేనప్పుడు, ఫ్యాన్ కేవలం ఆ వేడి గాలినే మళ్లీ మళ్లీ మనపైకి నెడుతుంది. అందుకే ఎంత స్పీడ్ గా ఫ్యాన్ పెట్టినా కూడా.. రూమ్ చల్లగా అనిపించదు. అయితే.. ఈ సమస్యకు పరిష్కారమే ‘ క్రాస్ వెంటిలేషన్’.

23
క్రాస్ వెంటిలేషన్ అంటే ఏమిటి?

గదిలోకి ఒక వైపు నుండి చల్లని గాలి రావడం, మరో వైపు నుండి వేడి గాలి బయటకు వెళ్లిపోవడాన్నే క్రాస్ వెంటిలేషన్ అంటారు. దీని వల్ల గది ఉష్ణోగ్రత సహజంగానే తగ్గుతుంది.

రూమ్ ఎలా చల్లబరచాలి..?

1.కిటికీలు, తలుపుల అమరిక...

గదికి ఎదురెదురుగా ఉన్న కిటికీలు లేదా తలుపులు తెరవండి. దీని వల్ల గాలి ఒకవైపు ప్రవహించి రెండో వైపు నుంచి బయటకు వెళ్తుంది. దీని వల్ల రూమ్ తొందరగా చల్లగా మారుతుంది.

2. టేబుల్ ఫ్యాన్‌ను ఇలా వాడండి:

మీ దగ్గర టేబుల్ ఫ్యాన్ లేదా పెడెస్టల్ ఫ్యాన్ ఉంటే, దానిని గది మధ్యలో కాకుండా కిటికీకి ఎదురుగా ఉంచండి.

చిట్కా: ఫ్యాన్ గాలి గది లోపలికి కాకుండా, గదిలోని వేడి గాలిని బయటకు నెట్టేలా (కిటికీ వైపుకు) తిప్పండి. దీనివల్ల గదిలోని వేడి త్వరగా బయటకు వెళ్లిపోయి, మరో కిటికీ గుండా చల్లని గాలి లోపలికి వస్తుంది.

33
3. సీలింగ్ ఫ్యాన్ దిశను మార్చండి:

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సీలింగ్ ఫ్యాన్లు రెండు దిశల్లో తిరుగుతాయి. వేసవిలో ఫ్యాన్ అపసవ్య దిశలో (Counter-Clockwise) తిరిగేలా చూడండి. ఇలా తిరిగినప్పుడే గాలి నేరుగా కిందికి నెట్టబడి, మనకు చల్లగా అనిపిస్తుంది.

4. సమయం చాలా ముఖ్యం:

మధ్యాహ్నం వేళ బయట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో కిటికీలు తెరిస్తే బయటి వేడి గాలి లోపలికి వస్తుంది. అందుకే ఈ క్రాస్ వెంటిలేషన్ ట్రిక్‌ను ఉదయం వేళ లేదా సాయంత్రం ఎండ తగ్గాక పాటించండి. అప్పుడు బయటి గాలి చల్లగా ఉంటుంది కాబట్టి ఫలితం బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories