నిద్రలో కూడా బరువు తగ్గించే అద్భుత పానీయం.. దాల్చిన చెక్క టీ...

First Published Aug 27, 2021, 4:25 PM IST

దాల్చినచెక్కే ఎందుకు?..అంటే దాల్చినచెక్కను సాధారణంగా సుగంధద్రవ్యంగా, రుచికరమైన మసాలాగా ఉపయోగిస్తారు. కూరలు, చారు, వంటకాలు, షేక్స్, స్మూతీల రుచి, వాసనతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలూ జోడించినట్లు అవుతుంది. 

బరువు తగ్గడం.. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించే సూత్రం...దీనికోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కఠినంగా వ్యాయామాలు, డైట్ లు, ఆహారం విషయంలో నోరు కట్టేసుకోవడంలాంటివి చేస్తుంటారు. అయితే ఎలాంటి శ్రమ లేకుండా బరువు తగ్గగలిగితే...? ఆలోచనే అద్బుతంగా ఉంది కదా...అలాంటితే దాల్చిన చెక్క టీతో సాధించవచ్చు. మసాలా టీ తాగుతూ.. పడుకున్నప్పుడు కూడా బరువు తగ్గొచ్చు.

దాల్చినచెక్కే ఎందుకు?..అంటే దాల్చినచెక్కను సాధారణంగా సుగంధద్రవ్యంగా, రుచికరమైన మసాలాగా ఉపయోగిస్తారు. కూరలు, చారు, వంటకాలు, షేక్స్, స్మూతీల రుచి, వాసనతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలూ జోడించినట్లు అవుతుంది. 

అందుకే తరాలుగా దాల్చిన చెక్కను ఆయుర్వేద,ఇతర పురాతన ఔషధాలలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ గా ఉపయోగిస్తున్నారు. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో దాల్చిన చెక్క సహజంగా సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మరింత తోడ్పడుతుంది. ఈ సుగంధ మసాలా జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

2012 లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్, విటమినోలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం... ఎలుకలలోని విసెరల్ కొవ్వును తగ్గించడంలో దాల్చినచెక్క గణనీయంగా సహాయపడిందని తేలింది. అంతే కాకుండా, పానీయాలు, సూప్‌లు, వంటకాలు, సలాడ్‌లకు దాల్చిన చెక్కను జోడించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మసాలా దినుసులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరమంటను నయం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపించడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క టీ తయారు చేసే విధానం.. 
ముందుగా ఓ గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. దీంట్లో 1 అంగుళం దాల్చిన చెక్క, 1 అంగుళం అల్లంముక్కను వేయాలి. ఈ గిన్నెకు మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. తరువాత ఈ నీటికి  ½ టీస్పూన్ గ్రీన్ టీ వేసి మంటను ఆపేయాలి. తరువాత టీని 3 నిమిషాలు అలాగే ఉంచి... ఆ తరువాత టీని వడకట్టి 1 టీస్పూన్ తేనె, రెండు నిమ్మకాయ ముక్కలు పిండాలి.

ఇంకో పద్ధతిలో కూడా ఈ టీని తయారు చేయవచ్చు. 1 టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌తో కూడా ఈ టీని తయారు చేయచ్చు. 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 ½ కప్పుల నీటిలో వేసి మరిగించండి. ఆ తరువాత టీని వడకట్టి, నిమ్మరసం, తేనె కలిపి తాగేయడమే. 

ఈ టీ తాగడం వల్ల మీ శరీరం డిటాక్సిఫై అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నరాలను రిలాక్స్ చేయడంలో నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.

click me!