పూలరెక్కలు, కొన్ని తేనెచుక్కలు రంగరించినట్టుగా... కొంతమంది బుగ్గలు అందంగా లేత గులాబీ రంగులో మెరిసిపోతుంటాయి. ఈ గులాబీ బుగ్గల అందానికి ఎదుటివారు ఫిదా అయిపోతుంటారు. అయితే ఇది కొంతమందికి సహజసిద్ధంగానే ఉంటే.. మరికొందరు మేకప్ తో బుగ్గలు లేత గులాబీ రంగు వచ్చేలా చేస్తుంటారు.
ఏదేమైనా, లేత గులాబీ రంగు బుగ్గలు మీ అందానికి మరింత వన్నెలద్దుతాయనేది మాత్రం కాదనలేని వాస్తవం. సహజంగానే నిగనిగలాడే గులాబీ బుగ్గలుంటే సమస్యే లేదు. కానీ అలా కాకుండా.. మేకప్ తో మాయ చేయాలనుకుంటే.. అది కూడా అందరికీ కుదరదు. మేకప్ ఎక్కువా, తక్కువా అవ్వడం వల్ల బుగ్గలు గులాబీ రంగులో కాకుండా విచిత్రంగా కనిపించే అవకాశం ఉంది. అందుకే సహజంగా మెరిసిపోయేలా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
మేకప్ లో బ్లష్షింగ్ వల్ల బుగ్గలు గులాబీరంగులో మెరిసిపోతాయి. అయితే ఈ బ్లష్షింగ్ చేసేముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల బ్లష్షింగ్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. మాయిశ్చరైజర్ రాయడానికి ముందు ముఖానికి ప్రీమియర్ అప్లై చేయండి. దీనివల్ల మొత్తం మేకప్ కూడా గంటలతరబడి ఉంటుంది.
Kajol
సరైన రంగు బ్లష్ ను ఎంచుకోవాలి. ముదురు రంగులు కాకుండా శరీర ఛాయకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. లైట్ పింక్ కలర్ బ్లష్ అయితే స్కిన్ టోన్ కు దగ్గరగా ఉండి.. వేసుకున్నా శరీర రంగులో కలిసిపోయి సహజంగా కనిపిస్తుంది.
పౌడర్ బ్లష్ ఉపయోగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ బుగ్గల మీదుండే యాపిల్ ఆకారపు చెక్కిళ్లను గమనించి దాని ప్రకారమే లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి. అప్పుడే మేకప్ పూసుకున్నట్టు కాకుండా సహజంగా ఉంటుంది.
క్రీమ్ బ్లష్ వాడుతున్నట్లైతే.. ఆ మిశ్రమంలో వేలు ముంచి బుగ్గల మీద అప్లై చేయాలి. అయితే దీన్ని మసాజ్ లాగా చేయకూడదు.
తరువాత చీక్ బోన్ కు లైట్ కలర్ బ్రాంజర్ ఉపయోగించాలి. దీనివల్ల బుగ్గల మీది గులాబీ రంగు హైలెట్ అవుతుంది. బుగ్గల మీదినుంచి చీక్ బోన్ వరకు ఈ బ్రాంజర్ ను వేసుకోవాలి. అయితే బ్రాంజర్ కోసం వేరే బ్రష్ వాడడం మరిచిపోవద్దు.