ఐరన్ లోపంతో జుట్టు రాలడమే కాదు.. మరెన్నో సమస్యలు వస్తాయి తెలుసా?

First Published Jan 1, 2023, 11:55 AM IST

శరీరంలో ఐరన్ లోపిస్తే.. ఒక్కటేంటీ.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  ఐరన్ లోపం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. 
 

నడుస్తున్నప్పుడు నీరసంగా లేదా శ్వాస ఆడకపోవడం లేదా వికారంగా అనిపిస్తోందా? అయితే మీశరీరంలో ఐరన్ లోపించినట్టే. మీ ఆహారంలో తగినంత ఇనుము లేకుంటే.. మీరు లోపలి నుంచి బాగా అలసిపోతారు. పిల్లలైనా కావొచ్చు లేదా పెద్దలైనా కావచ్చు. ఐరన్ లోపం ఎవరి శరీరంలోనైనా వస్తుంది. ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయిని నియంత్రించడానికి మీ శరీరానికి తగినంత హిమోగ్లోబిన్ అవసరం. ఈ హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది మీ రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. 
 

మీ శరీర కదలికలు, ప్రవర్తనను అంచనా వేయడం చాలా ముఖ్యం. సాధారణ మానసిక స్థితి మార్పుల నుంచి మైకము వరకు ఎన్నో లక్షణాలు మీ శరీరంలో ఇనుము లోపాన్ని తెలియజేస్తాయి. మన శరీరంలో ఇనుము లోపిస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటంటే.. 

iron deficiency

1. శ్వాస తీసుకోవడంలో సమస్యలు
2. తీవ్రమైన తలనొప్పి
3. గుండె దడ
4.నోటి నొప్పి,  వాపు
5. కాళ్ళలో చంచలత
6. పెళుసైన, వేలిగోళ్లు
7. వింత కోరికలు
8. నిరాశ
9. ఆకలి లేకపోవడం

అలసట

 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డేటాబేస్ ప్రకారం.. మీ శరీరానికి తగినంత హిమోగ్లోబిన్ లభించనప్పుడు తక్కువ ఆక్సిజన్ మీ కణజాలాలను, కండరాలకు చేరుకుంటుంది.  దీంతో శరీరం శక్తి కోల్పోతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఆక్సిజన్ ఎక్కువగా ఉండే రక్తాన్ని పొందడానికి గుండె బాగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. దీంతో మీకు విపరీతమైన అలసట కలుగుతుంది. 
 

పాలిపోయిన చర్మం

 6 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో చర్మం పాలిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఇనుము లోపం శరీరంలోని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ముఖం, చిగుళ్ళు, పెదవుల లోపలి భాగం లేదా దిగువ కనురెప్పలు వంటి శరీరమంతా కూడా సంభవిస్తుంది. నల్లటి స్కిన్ టోన్ ఉన్నవారికి కనురెప్పలలో చర్మం పాలిపోతుంది. అందుకే ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. 
 

పొడి, దెబ్బతిన్న జుట్టు, చర్మం

ఇనుమును తక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. చర్మం, జుట్టు ఆక్సిజన్ కోల్పోయినప్పుడు బాగా జుట్టు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది.

బహిష్టు సమస్య

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. భారతీయ మహిళల్లో దాదాపు 50 శాతం మంది ఇనుము లోపంతో బాధపడుతున్నారు. ఇది ఆక్సిజన్ స్థాయిలో సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల నెలసరి లేట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఎక్కువ రోజులు పీరియడ్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది రక్త నష్టానికి దారితీస్తుంది. ఇనుము లోపంతో.. అలసట, బలహీనత, మైకము లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. 

చూలు

తీవ్రమైన ఇనుము లోపం కూడా గర్భధారణకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది అకాల పుట్టుక ప్రమాదానికి కూడా దారితీస్తుంది. గర్భధారణ సమయంలో మహిళల్లో ఇనుము లోపిస్తే..  పిల్లలు తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది. అలాగే ప్రసవానంతర నిరాశకు కూడా దారితీస్తుంది. 
 

click me!