పుదీనా వాటర్ తో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే?

First Published Jan 2, 2023, 2:35 PM IST

చలికాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే జస్ట్ ఒక గ్లాస్ పుదీనా వాటర్ ను తాగితే ఒక్క జీర్ణ సమస్యలేంటి.. ఆ సమస్యలు కూడా నయమవుతాయి. 
 

పుదీనా ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక గ్లాస్ పుదీనా నీటిని తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతేకాదు దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ హెర్బ్ జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం నుంచి పోషకాలను గ్రహించడానికి కూడా సహాయపడుతుంది.
 

mint

పుదీనాలో విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ, కేలరీలు, ప్రోటీన్లు, విటమిన్ బి6, పొటాషియం, కార్భోహైడ్రేట్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పుదీనా జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. 

పుదీనా పోషకాలను గ్రహించే సామర్థాన్ని కలిగి ఉంటుంది. దీంతో మన జీవక్రియ మరింత మెరుగ్గా ఉంటుంది.  జీవక్రియ పెరగడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంది. పుదీనా నీటిని తాగితే కడుపునకు సంబంధించిన, జీర్ణ సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. 

ఒకవేళ మీరు యసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతున్నట్టైతే.. లేదా ఎసిడిటీ, గ్యాస్ లేదా ఇతర సమస్యలు ఉంటే పుదీనా నీటిని తప్పకుండా తాగండి. ఇది మీకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీన్ని తాగిన వెంటనే సమస్యలన్నీ ఇట్టే తగ్గిపోతాయి. 

మన నోట్ల ఉండే బ్యాక్టీరియా హాలిటోసిస్ లేదా చెడు శ్వాసకు కారణమవుతుంది. పుదీనాతో చేసిన మౌత్ వాష్ లు నోట్లోని దుర్వాసనను తగ్గిస్తాయి. పుదీనాలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు జలుబు, జ్వరంతో సంబంధం ఉన్న నొప్పులను, అసౌకర్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

mint leaves

పుదీనాలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మ వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అవి మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు పుదీనా చర్మాన్ని మృదువుగా, అందంగా మెరిసేలా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

పుదీనా వాటర్ చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి, మెరుగుపరచడానికి మన శరీరానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను తీసకుని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంగా అలాగే ఉండనీయాలి. కావాలనుకుంటే  ఈ నీళ్లలో నిమ్మరసం కూడా పిండొచ్చు. అయితే నీళ్లను ఉదయం పరిగడుపున తాగితే మంచి ఫలితాలను పొందుతారు. 
 

click me!