ఒంట్లో ఐరన్ లోపిస్తే.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?

Published : Nov 25, 2022, 03:54 PM IST

ఇనుము పుష్కలంగా ఉండే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. లేకపోతే మీకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
16
ఒంట్లో ఐరన్ లోపిస్తే.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?

మన శరీరానికి కావాల్సిన  ముఖ్యమైన ఖనిజం ఇనుము. ఈ ఖనిజం మనకు పోషణను అందించమే కాదు ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో ఇనుము లోపిస్తే శరీరం బలహీనపడుతుంది. అంతేకాదు హిమోగ్లోబిన్ కూడా తగ్గడం మొదలవుతుంది. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

26

అందుకే ఇనుము పుష్కలంగా ఉండే బచ్చలికూర, నిమ్మకాయ, బీట్ రూట్, పిస్తా, జామ, అత్తిపండ్లు, ఎండు ద్రాక్ష, వంటి వాటిని ఎక్కువగా తినాలి. ఇంతకీ శరీరంలో ఇనుము లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

రక్తహీనత

శరీరంలో ఇనుము తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఇది కూడా ఒక వ్యాధే. దీనిలో మన శరీరంలో రక్తం చాలా తగ్గుతుంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే ఆడవారికే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య సర్వ సాధారణం. రక్తం తక్కువగా ఉంటే లేని పోని రోగాలు వస్తాయి. అందుకే వీళ్లు ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. 
 

46

బలహీనత

శరీరంలో ఇనుము ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు.. మన శరీరం హిమోగ్లోబిన్ ను తయారుచేయదు. దీనివల్ల మీరు రోజంగా బలహీనంగా ఉంటాయి. ఊరికే అలసిపోయినట్టుగా భావిస్తారు. వేలకు నిద్రపోయినా బలహీనంగానే కనిపిస్తారు. మీ రోజు వారి పనులను చేయడానికి కూడా చేతకాదు. 
 

56
heart diseases

గుండె జబ్బులు

భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నవారిని ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు. అయితే మన శరీరంలో ఐరన్ లోపిస్తే.. హిమోగ్లోబిన్ లోపం వస్తుంది. దీనివల్ల మన శరీరంలోని ఎన్నో భాగాలకు ఆక్సిజన్ సరైన మొత్తంలో చేరదు. దీనివల్ల గుండెకు పని భారం ఎక్కువవుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 
 

66

జట్టు, చర్మ వ్యాధులు

ఐరన్ కూడా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ ఖనిజం లోపించిన వారిలో చర్మానికి, జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారడం, మచ్చలు, చర్మ రంగు మారడం, తగ్గడం, చర్మం నిర్జీవంగా మారడం, జుట్టు విపరీతంగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories