డయాబెటీస్ రాకూడదంటే ఇలా చేయండి

First Published Nov 25, 2022, 2:02 PM IST

షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా కూడా రావొచ్చు. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మధుమేహానికి దారితీస్తాయి. డయాబెటీస్ అభివృద్ధి చెందకుండా  ఉండటానికి ఈ పనులు చేయండి. 
 

డయాబెటీస్ జీవనశైలి వల్ల కలిగే వ్యాధి అన్న సంగతి చాలా మందికి తెలుసు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ డయాబెటీస్ ఒక సారి వస్తే.. దీన్ని పూర్తిగా తగ్గిపోతుందనేది లేదు. మనం చేయాల్సిందల్లా దీన్ని కంట్రోల్ లో ఉంచడం మాత్రమే. అందుకే డయాబెటీస్ రాకుండా ఉండేందుకు కొన్నిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

టైప్ 1 డయాబెటీస్ వంశపారంపర్యంగా వస్తుంది. ఇక టైప్ 2 డయాబెటీస్ మీ మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. అసలు డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కార్భోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి

మధుమేహులు కార్భోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే  ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బాగా పెంచుతాయి. అందుకే మొదటి నుంచి కార్భోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గిస్తే మంచిది. మనం రోజూ తినే అన్నంలో, గోధుమ ఆహారాల్లో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

మైదా, సెరిన్, చక్కెర, కొన్నని రకాల పండ్లలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కార్భోహైడ్రేట్లు ఏయే ఆహారాల్లో ఉంటాయో తెలుసుకుని వాటిని కొద్ది మొత్తంలోనే తీసుకోవాలి. చక్కెర, బెల్లం, తేనె  వంటి తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఒకేరోజు ఎక్కువ పండ్లను తినకూడదు. అలాగే శారీరకంగా ఎంత పనిచేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. 

ఒత్తిడి

ఒత్తిడి క్రమంగా డయాబెటీస్ కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కలిగినప్పుడు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కణాలు ఎక్కువ గ్లూకోజ్ ను రిలీజ్ అవుతాయి. ఒత్తిడిని సకాలంలో తగ్గించుకోకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అలాగే క్లోమం ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయండి. 
 


నిద్రలేమి

నిద్రలేమి కూడా షుగర్ వ్యాధికి కారణమవుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోయేవారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక వయోజనుడు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి నిద్రలేమి ఆకలిని పెంచుతుంది. దీంతో బరువు వేగంగా బరువు పెరుగుతారు. ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇవన్నీ మధుమేహానికి దారితీస్తాయి. అందుకే రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. 
 

మంచి ఫ్యాటీ ఫుడ్స్

ఫ్యాటీ ఫుడ్స్ ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. నెయ్యి, కొబ్బరి నూనె, అవోకాడో, ఆలివ్ లు, గింజలు, విత్తనాల్లో మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల కొంతవరకు మధుమేహాన్ని నివారించవచ్చు.
 

కొన్నిసార్లు మనం ఏమి తింటున్నామో మాత్రమే కాదు.. ఎలా తింటామో కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. డయాబెటిస్ కు కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి మీరు తినేటప్పుడు.. ఎలా తింటున్నారో చూసుకోండి. మొదట మీరు నాన్ కార్బ్-ఫ్రీ కూరగాయలైన ఆకుపచ్చ, నారింజ, పసుపు, ఎరుపు రంగులో ఉండే కూరగాయలను తినండి. ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్  కూడా తీసుకోండి. కాయధాన్యాలు, గుడ్లు, చికెన్, మాంసం, మొలకలు, గింజలు, నెయ్యి లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీని తరువాత మాత్రమే మీరు కార్బ్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. అంటే అన్నం, చపాతీ లేదా ఏదైనా కావచ్చు. ఏ ఆహారాన్ని తిన్నా.. మిత పరిమాణంలో మాత్రమే తినండి. 

శారీరక శ్రమ

శారీరక శ్రమ లేకపోవడం వల్లా కూడా మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయండి. 
 

click me!