చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Nov 25, 2022, 02:55 PM IST

వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు రావడం చాలా కామన్. అయితే ఈ కీళ్ల నొప్పులు చలికాలంలో మరీ ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.   

PREV
17
  చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇలా చేయండి..

చలికాలంలో ఒక్కటేమిటీ ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందికి జలుబు చేసినా శరీర నొప్పులు వస్తాయి. దీనికి కీళ్ల నొప్పులే ప్రధానమని చాలా మంది అంటుంటారు. ఈ రకమైన మోకాలి నొప్పి, మోచేయి నొప్పి, వెన్నునొప్పి ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి సంబంధించినవి. వివిధ కారణాల వల్ల ఎముకల నష్టం సంభవించవచ్చు. వయస్సు, గాయం వంటివి వీటికి కారణాలు. ముఖ్యంగా బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. శీతాకాలంలో విటమిన్ డి లోపించడం వల్ల కూడా అటువంటి కీళ్ల నొప్పులు వస్తాయి. ఏదేమైనా .. ఈ రకమైన 'కీళ్ల నొప్పులను' నివారించడానికి గుర్తుంచుకోవాల్సిన విషయాలను తెలుసుకుందాం.. 

27

వ్యాయామం లేకపోవడం

వ్యాయామం లేకపోవడం  వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఎముకలు, కండరాల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం చేయకపోతే.. బరువు కూడా బాగా పెరిగిపోతారు. ఈ బరువు కాస్త కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. 

37

శరీర ఉష్ణోగ్రత

శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. దీనివల్ల కూడా నొప్పులు కలుగుతాయి. అందుకే ఈ సీజన్ లో మీరు హీటింగ్ ప్యాడ్లు, వేడి నీటి సీసాలు, వెచ్చని బట్టలను ఉపయోగించండి. 

47

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు

చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి అధికంగా ఉండే ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి మీ రోజు వారి ఆహారంలో అవిసె గింజలు, సాల్మన్ ఫిష్, వాల్ నట్స్, అవోకాడోలను చేర్చుకోండి. 
 

57

కాల్షియం లోపం

కాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాల్షియంను శరీరం శోషించుకోవాలంటే విటమిన్ డి ఉండటంచాలా అవసరం. అందుకే గుడ్లు, బచ్చలికూర, పుట్టగొడుగులు, పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, నారింజ రసం వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి. 
 

67
Leafy Vegetables

ఆకు కూరలు

ఆకుకూరలు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను మీ ఆహారంలో పక్కాగా చేర్చుకోండి. ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే దోసకాయలు, క్యారెట్లను బాగా తినండి. 
 

77

నీటిని ఎక్కువగా తాగాలి

ముందే ఇది చలికాలం.. పైగా దాహం కూడా వేడయం లేదని చాలా మందని నీళ్లను తాగడం మానేస్తుంటారు. కానీ మన శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటి లోపం ఏర్పడితే ఎముకలు,శరీరం మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పటినుంచైనా ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీరు తాగేలా చూసుకోండి.

 

Read more Photos on
click me!

Recommended Stories