IRCTC Tour Package : నేపాల్ పశుపతినాథ్ నుండి శ్రీశైలం మల్లన్న వరకు.. రూ.15 వేలకే ఐఆర్సిటిసి సూపర్ టూర్ ప్లాన్

Published : Jun 01, 2026, 06:14 PM IST

IRCTC కొత్త 'భారత్ గౌరవ్' ఆధ్యాత్మిక యాత్ర ప్యాకేజీలను ప్రకటించింది. జూన్, జులై 2026 నెలలకు సంబంధించిన ఈ టూర్లలో రైలు ప్రయాణం, వసతి, భోజనం వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.

PREV
15
IRCTC ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ

తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు చుట్టిరావాలనుకునే భక్తులకు ఇది గుడ్ న్యూస్. భారతీయ రైల్వే టూరిజం విభాగమైన IRCTC జూన్, జులై 2026 నెలల కోసం కొత్త 'భారత్ గౌరవ్' యాత్ర రైలు ప్యాకేజీలను ప్రకటించింది. కేవలం రూ.15 వేల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలతో ఉత్తర, దక్షిణ భారతదేశంతో పాటు నేపాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్‌లో దర్శించుకోవచ్చు.

25
భారత్ గౌరవ్ స్కీమ్

గతంలో యాత్రలకు వెళ్లేవారు రైలు టికెట్లు, హోటల్స్, భోజనం, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వంటివి విడివిడిగా చూసుకోవాల్సి వచ్చేది. కానీ భారత్ గౌరవ్ స్కీమ్‌తో ఆ ఇబ్బందులు తీరాయి. ఒక్కసారి ప్యాకేజీ బుక్ చేసుకుంటే చాలు.. రైలు ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక ప్రదేశాల సందర్శన, ఇన్సూరెన్స్ అన్నీ ఒకే ప్యాకేజీలో లభిస్తాయి.

35
IRCTC కొత్త టూర్ ప్యాకేజీ
ఈసారి IRCTC ప్రకటించిన యాత్రల్లో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జూన్ 3న ప్రారంభమయ్యే ఈ టూర్‌లో పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి క్షేత్రాలు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.16,700. వీటితో పాటు సప్త జ్యోతిర్లింగ దర్శనం, దక్షిణ దర్శన్ ప్యాకేజీల ద్వారా ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, తిరుపతి, రామేశ్వరం, శ్రీశైలం వంటి క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు.
45
భారత్ గౌరవ్ రైలు
దక్షిణ భారతదేశంలోని ఆలయాలను సందర్శించాలనుకునే వారి కోసం 'దివ్య దక్షిణ యాత్ర', 'సౌత్ ఇండియా టెంపుల్ టూర్' ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. 9 నుంచి 13 రోజుల ఈ యాత్రల్లో భాగంగా తిరువణ్ణామలై, చిదంబరం, తంజావూరు, తిరుచ్చి, మదురై, కన్యాకుమారి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను చుట్టిరావచ్చు.
55
నేపాల్ దర్శనం కూడా
ఈ ఏడాది టూర్లలో నేపాల్ యాత్రను కూడా చేర్చడం మరో విశేషం. 'పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర' పేరుతో ఈ టూర్‌ను అందిస్తున్నారు. దీని ద్వారా ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయం, పోఖారా, చిత్వాన్ నేషనల్ పార్క్‌ను చూడొచ్చు. జూన్ 24న ప్రారంభమయ్యే ఈ 10 రోజుల యాత్ర ప్రారంభ ధర రూ.61,340. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలను ఒకే పర్యటనలో అందించే ఈ IRCTC ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Read more Photos on
click me!

Recommended Stories