స్నేహితులు లేని జీవితం ఎడారి లాంటిది. మన జీవితంలో ఆనందాలను , దుఃఖాలను పంచుకోవడానికి కచ్చితంగా స్నేహితులు ఉండాల్సిందే. మనతో ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా, మన కోసం జీవిస్తారు. మనకు తోడుగా నిలుస్తారు. ఇలాంటి విలువైన బంధాన్ని సెలబ్రేట్ చేసేందుకే ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. స్నేహితులుగా మనల్ని అర్థం చేసుకునే, మనకు అండగా నిలిచే వారికి కృతజ్ఞత తెలియజేసే పవిత్రమైన రోజు ఇది.
24
స్నేహితుల దినోత్సవ చరిత్ర
పరాగ్వేకు చెందిన డాక్టర్ ఆర్టెమియో బ్రాకో అనే వ్యక్తి స్నేహితుల దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. 1958లో పరాగ్వే సివిల్ సంస్థ ప్రపంచ స్నేహితుల దినోత్సవానికి కూడా సిఫారసు చేసింది. చాలా దశాబ్దాల తర్వాత, 2011లో జూలై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. శాంతిని వ్యాప్తి చేయడానికి, సామాజిక సంబంధాలను మెరుగుపరచడానికి ఈ రోజు జరుపుకుంటారు. ఆ తర్వాత దీనిని ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం జరుపుకోవడం మొదలుపెట్టారు.
34
ఎలా జరుపుకోవాలి?
మీ వేడుకలు ఎంత గొప్పగా ఉన్నాయో ముఖ్యం కాదు. మీ స్నేహితుడి సమయాన్ని, వారి స్నేహాన్ని గౌరవించే ఏదైనా ఒక పని చేసినా సరిపోతుంది. ఉదాహరణకు, మీతో కూర్చుని మాట్లాడటం మీ స్నేహితుడికి ఇష్టమైన విషయం అయితే, మంచి ప్రదేశంలో వారితో సమయం గడపవచ్చు. ఇంట్లో సాధారణ టీ పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులను ఆహ్వానించవచ్చు. గ్రీటింగ్ కార్డ్ ఇవ్వవచ్చు.