పెళ్లికూతురు రాధికా మర్చంట్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

First Published | Jul 12, 2024, 11:11 AM IST

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఈ రోజు ఏడు అడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ రోజు రాధికా మర్చంట్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. ఈ రోజే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జరగనుంది. ఇంకేముంది ఈ అంబానీ వారి పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా హాజరు కానునున్నారు. మొదటి ఫ్రీ వెడ్డింగ్, రెండో ఫ్రీ వెడ్డింగ్ అంటూ.. కోట్లు ఖర్చు పెట్టి.. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ ఫంక్షన్ కు వచ్చిన అతిథులకు అథితి మర్యాదలు ఏ రేంజ్ లో చేశారో మనం టీవీ, వార్తా పత్రికల్లో చూసేశాం. ఇక ఈ పెళ్లి తంతు ఎంత గ్రాండ్ గా జరుగుతుందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పెళ్లి  కూతురు రాధికా మర్చంట్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ రోజువారి పెళ్లి గనుక.. ఆమె గురించి తెలియని విషయాలను తెలుసుకుందాం పదండి. 

రాధిక మర్చంట్ చదువు..

ప్రస్తుతం రాధికా మర్చంట్ వయసు 29 ఏండ్లు. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ దంపతుల కూతురు.  ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్లో రాధిక తన చదువును కంప్లీట్ చేశారు. 


గ్రాడ్యుయేషన్

రాధికా మర్చంట్ న్యూయార్క్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈమె తండ్రి వేరేన్ మర్చంట్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ తయారీ సంస్థ 'ఎన్కోర్ హెల్త్ కేర్'కు సీఈఓ.
 

క్లాసికల్ డ్యాన్సర్

చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుతున్న సమాచారం ప్రకారం.. రాధికా మర్చంట్ కూడా క్లాసికల్ డ్యాన్సరేనట. ఇందుకు సంబంధించిన.. చాలా కాలం నాటి ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది.
 

Anant Ambani Radhika Merchant wedding

సింప్లిసిటీ 

రాధికా మర్చంట్ ఎంత సింప్లీ సిటీగా ఉంటుందో ఆమె ఫోటోలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. మీరు గమనించారో లేదో.. ఈమె చాలా ఫోటోల్లో లైట్ అండ్ మినిమమ్ మేకప్ లోనే కనిపిస్తుంది.ఈమె హెవీగా మేకప్ అస్సలు వేసుకోదు.

అనంత్-రాధిక లవ్ స్టోరీ

మీకు తెలుసా? అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు చిన్న నాటి స్నేహితులు. 2018లో అనంత్, రాధిక కలిసి దిగిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరికీ ముందే పరిచయడం, డేటింగ్ పై అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి. 
 

ఇద్దరికీ సంబంధించిన వార్తలు..

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు 2019లోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని పలు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ వార్తలపై అంబానీ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేదు. 

ట్రెక్కింగ్, స్విమ్మింగ్ హాబీ

రాధికా మర్చంట్ కు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఈమెకు స్విమ్మింగ్ అన్నా,  ట్రెక్కింగ్ అన్నా చాలా ఇష్టమట. వీలున్నప్పుడల్లా ట్రెక్కింగ్ చేస్తుందట. 
 

Latest Videos

click me!