చపాతీలను గుండ్రంగా, మెత్తగా, పూరీల్లా తయారుచేయడం ఒక కళ. ఇది అందరికీ సాధ్యం కాదు.. అని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా ఇలా చేయలేని వారు. కానీ కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం ప్రతి ఒక్కరూ హోటల్ స్టైల్ లో చపాతీలను మెత్తగా చేసేయొచ్చు. నిజానికి మొదట్లో గుండ్రని, మెత్తటి చపాతీలను తయారు చేయడం చాలా కష్టం.
కానీ కొంతమంది మాత్రం అస్సలు కష్టపడకుండా చపాతీలను మెత్తగా, గుండ్రంగా, పూరీల్లా తయారుచేస్తారు. చాలా మంది పిండిని సరిగ్గా కలపరు. హడావుడిగా పింగిని కలిపేసి చపాతీలను తయారుచేస్తారు. దీనివల్లే చపాతీలు మెత్తగా రావు. అలాగే చాలా మంది చపాతీ పిండిని చాలా గట్టిగా కలుపుతారు. దీనివల్ల కూడా చపాతీలు మెత్తగా రావు. నిజానికి పిండి ఎంత మెత్తగా ఉంటే.. చపాతీలు అంత మెత్తగా, పూరీల్లా ఉబ్బుతాయి.
చపాతీలు ఎందుకు గట్టిగా వస్తాయి?
చపాతీ పిండిని అతిగా కలపడం వల్ల అది గట్టిపడుతుంది. అలాగే చపాతీలను ఎక్కువ మంటమీద లేదా ఎక్కువ సేపు కాల్చడం వల్ల కూడా అవి మెత్తగా కాకుండా గట్టిగా అవుతాయి. చపాతీలు మొత్తగా రావాలంటే పిండిని తేలికగా కలుపుకోవాలి. అలాగే రోటీలను మీడియం మంటపై కాల్చాలి. అలాగే చాలా తక్కువ సేపు కాల్చాలి.
chapati
రోటీలు ఎందుకు ఉబ్బవు?
పిండిని గట్టిగా కలపడం వల్ల రోటీలు ఉబ్బవు. అలాగే రోటీలను పెనంపై ఎక్కువ సేపు కాల్చడం వల్ల కూడా ఉబ్బవు. కాబట్టి చపాతీ పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రోటీలను పెనంపై ఎక్కువ సేపు కాల్చకుండా చూసుకోండి. ముఖ్యంగా చపాతీ పిండిని కలిపిన తర్వాత దాన్ని నిండుగా గుడ్డతో కప్పి కాసేపు పక్కన పెట్టుకోండి.
పాల పొడితో మెత్తని రోటీలను ఎలా తయారు చేసుకోవాలి?
పాల పొడితే కూడా మీరు చపాతీని మెత్తగా చేయొచ్చు. రోటీలు మెత్తగా ఉండాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు దానిలో ఒక టీస్పూన్ మిల్క్ పౌడర్ ను వేసి మిక్స్ చేసి తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా కలుపుకోండి. ఆ తర్వాత పిండిని కనీసం 5-7 నిమిషాలు ఒక గుడ్డతో కప్పి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పిండిలో ఉన్న గ్లూటెన్ బాగా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఇది పిండిని మృదువుగా కూడా చేస్తుంది. రోటీలు కూడా మెత్తగా వస్తాయి. చపాతీలు మెత్తగా రావాలంటే మాత్రం మీరు పిండిని మెత్తగా కలుపుకోవాలి.
మెత్తటి రోటీల కోసం పాల పొడి ఎలా సహాయపడుతుంది?
మిల్క్ పౌడర్ లో ఉండే కొన్ని లక్షణాలు రోటీలు ఉబ్బడానికి, మెత్తగా, మృదువుగా రావడానికి బాగా సహాయపడుతుంది. పాల పొడిలో పాల ఘనపదార్థాలు ఉంటాయి. ఇవి పిండిలో తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి. అలాగే పిండిలో పాల పొడిని కలపడం వల్ల అది నీటిని గ్రహిస్తుంది. అలాగే ఇదిని పిండిని మరింత మెత్తగా చేస్తుంది. ఈ ఆర్ద్రీకరణ వల్ల రోటీలను కాల్చేటప్పుడు రోటీలు గట్టిపకుండా ఉంటాయి. ఇది చపాతీలు మెత్తగా, పూరీలా ఉబ్బడానికి కారణమవుతుంది.
chapati
ఆకృతిని మెరుగుపరుస్తుంది
మిల్క్ పౌడర్ లో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు పిండికి మంచి ఆకృతిని ఇస్తుంది. పాల పొడి చపాతీ పిండిలో బైండింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.ఇది పిండి స్థితిస్థాపకతను కూడా మెరుగుపరుస్తుంది. మిల్క్ పౌడర్ లో ఉండే చక్కెరలు చపాతీకి మంచి బ్రౌన్ కలర్ ను ఇస్తుంది. ఇది రోటీలకు లేత గోధుమ రంగును ఇస్తుంది. అలాగే వాటి రుచిని కూడా పెంచుతుంది.
chapati
అంతేకాకుండా పాల పొడిలో ప్రోటీన్, కాల్షియంతో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రోటీ పిండికి పాల పొడిని కలపడం వల్ల దాని ఆకృతి మెరుగుపడటమే కాకుండా దానిలో పోషకాల విలువ కూడా పెరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.