ముక్కు గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు..

First Published | Nov 5, 2023, 4:35 PM IST

ముక్కుతో ఏం చేస్తాం.. జస్ట్ వాసన్ చూస్తాం, శ్వాస పీలుస్తాం.. గంతేకదా.. అనుకుంటే పొరపాటే. అవును మరి మన ముక్కు గురించి మనకే తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. వాటిని గనుక తెలుసుకుంటే షాక్ అవుతారు..
 

మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం. మన శరీరంలో ఉండే ప్రతి అవయవం.. దేనికదే ప్రత్యేకం. మన శరీరంలోని ఏ అవయవం పనిచేయకపోయినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరం ఎన్నో భాగాల కలయిక. దీనిలో ముక్కు ఒకటి. ముక్కే కదా అని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఎన్నో వైవిధ్యమైన, ఆకట్టుకునే సామర్థ్యాలను కలిగి ఉంటుంది తెలుసా? మన ముక్కు గురించి మనకే తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1. ప్రతి ఒక్కరికీ తుమ్ములు వస్తాయి. ఇది చాలా కామన్. అయితే మీరు తుమ్మే విధానం వంశపారంపర్య లక్షణం కావొచ్చంటున్నారు పరిశోధకులు.  తుమ్ము శైలి ప్రత్యేకమైనదేం కాదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది జెనెటిక్స్ లక్షణం కావచ్చు. అలాగే ఇది వారసత్వంగా వస్తుంది. ఇంట్లో వాళ్లలాగ ఎలా అయితే నవ్వుతారో తుమ్ము కూడా జెనెటిక్స్ గా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos


2. మన ముక్కులో ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంటుంది తెలుసా? అంతేకాదు ఇది చాలా ఎఫెక్టీవ్ గా ఉంటుంది. మన నాసికా రంధ్రాల లోపల ఉండే చిన్న చిన్న వెంట్రుకలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి దుమ్ము, దూళి, ఇతర కణాల నుంచి సూక్ష్మక్రిములు అడ్డుకుంటాయి. ముక్కు నుంచి శ్వాస తీసుకున్నప్పుడు గాలి తేమగా, వెచ్చగా ఉంటుంది ఎప్పుడైనా గమనించారా? అందుకే వెదర్ చల్లగా ఉన్నప్పుడు ముక్కునుంచే గాలిని పీల్చాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ మీ ఊపిరితిత్తులలో ఉండే సున్నితమైన కణజాలాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

3.  తుమ్ము మనం అనుకున్న దానికంటే  చాలా శక్తివంతమైనది. తుమ్ము అసంకల్పిత చర్య. దీన్ని మనం ఆపలేం. మీకు తెలుసా? తుమ్ము గంటకు సగటున 100 మైళ్ల వేగంతో సూక్ష్మక్రిములను గాలిలోకి నెట్టగలదు. అందుకే తుమ్ము వచ్చినప్పుడు నోటిని మూయాలి. 
 

4. ముక్కులు ఎన్నో ఆకారాల్లో ఉంటాయి. జర్నల్ ఆఫ్ క్రానియోఫేషియల్ సర్జరీలో ప్రచురితమైన ఒక సర్వే ప్రకారం 14 వేర్వేరు మనిషి ముక్కు ఆకారాలను గుర్తించారు. కాబట్టి మన ముక్కు మనకు ప్రత్యేకమే మరి. 

5. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ప్రకారం.. మనిషికి సుమారుగా 400 రకాల సువాసన గ్రాహకాలు ఉంటాయి. అంటే మనం దాదాపుగా ఒక ట్రిలియన్ వేరువేరు వాసనలను గుర్తించగలం. అయితే ఈ సంఖ్య వయస్సుతో పాటుగా తగ్గుతుందట. 

6. 10 సంవత్సరాల వయస్సు వరకు మొత్తం నాసికా ఆకారం ఏర్పడుతుంది. అయితే అమ్మాయిలకు ముక్కు 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు పెరుగుతూనే ఉంటుంది. పురుషుల ముక్కు 17 నుంచి 19 సంవత్సరాల వయస్సు వరకు పెరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ వయసు పెరుగుతున్న కొద్దీ మన ముక్కు కూడా పెరుగుతుందట. 
 

click me!