దీపావళి నాడు రాత్రి కాగానే జనాలు ఇంట్లో, దేవాలయాల్లో మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలను వెలిగిస్తారు. అలాగే టపాసులను కూడా కాల్చుతారు. ఈ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. శ్రీరాముడు వనవాసం నుంచి తిరిగి అయోధ్యకు రావడానికి ఈ దీపాలు స్వాగతిస్తాయని కూడా నమ్ముతారు. వేలాది నూనె దీపాలు, విద్యుత్ దీపాలు చీకటి, అజ్ఞానంపై కాంతి, జ్ఞానం విజయాన్ని సూచిస్తాయని చెబుతారు.