ఆస్తమా కేవలం ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేసే వ్యాధి మాత్రమే కాదు
ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే ఉబ్బసం ఎన్నో రోగాలకు ప్రమాదకరకమని నిపుణులు అంటున్నారు. అయితే ఉబ్బసం కారణంగా చనిపోయే అవకాశం చాలా తక్కువ. కానీ ఇది అందరినీ సమానంగా ప్రభావితం చేయదు. పురుషుల కంటే మహిళలు, పెద్దలకు ఉబ్బసం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ప్రత్యేకించి బరువు ఎక్కువగా ఉన్నవారికి. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలే ఆస్తమాతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. కారు ఎగ్జాస్ట్, పారిశ్రామిక కాలుష్యం నుంచి గాలిలో పెరిగిన ధూళి కణాల కారణంగా ఉబ్బరం ఎక్కువగా వస్తుంది.