ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే నేచురల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

First Published Nov 25, 2023, 2:59 PM IST

చలికాలంలో కొందరి చర్మం పొడిబారితే.. మరికొందరి చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. ఈ అదనపు నూనె చర్మ రంధ్రాలను మూసేస్తుంది. ఇది మొటిమలు వంటి ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తుంది. అయితే కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ లు జిడ్డును తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే? 
 

Image: Getty

చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇది సర్వసాధారణం. ఈ సీజన్ లో చలి కారణంగా చర్మం కాంతి తగ్గుతుంది. ముఖం డల్ గా కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్ లో చర్మ సంరక్షణ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.
 

ఈ సీజన్ లో కొంతమంది చర్మం పొడిబారుతుంది. మరికొంతమంది చర్మం జిడ్డుగా మారుతుంది. జిడ్డు చర్మం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్ని ప్రొడక్ట్స్ ను వాడినా కూడా ముఖంలో ఎక్స్ ట్రా ఆయిల్ మాత్రం తగ్గదు. మీ చర్మం కూడా జిడ్డుగా ఉంటే చలికాలంలో ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి. వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి. 

Latest Videos


Image: Getty Images

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

ముల్తానీ మట్టి చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇది ముఖంపై ఉన్న అదనపు నూనెను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవాలనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ ను ఖచ్చితంగా వాడండి. దీన్ని తయారు చేయడానికి.. ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి వేసి అందులో రోజ్ వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి.
 

ఆరెంజ్, గంధపు చెక్క ఫేస్ ప్యాక్

విటమిన్  సి పుష్కలంగా ఉండే నారింజ పండ్లు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మంచి మేలు చేస్తాయి. చలికాలంలో ముఖానికి తక్షణ మెరుపు రావాలంటే ఆరెంజ్, గంధపు చెక్క ఫేస్ ప్యాక్ ను వేసుకోవచ్చు. ఇందుకోసం  ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ ను తీసుకుని అందులో 1 టీస్పూన్ గంధం పొడిని వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి.

క్యారెట్,  తేనె ప్యాక్

చలికాలంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ డెడ్ స్కిన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి క్యారెట్లను తురిమి అందులో తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయండి.

face pack

శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్

మెరిసే చర్మానికి పసుపు, శెనగపిండి ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతుంటే మీ చర్మ సంరక్షణ దినచర్యలో శెనగపిండి, పసుపును చేర్చండి. ఈ ప్యాక్ ను తయారు చేయడానికి శెనగపిండిలో పసుపు, పాలను వేసి కలపండి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత నీటితో కడిగేయండి.

click me!