మన జుట్టు గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు

First Published | Nov 3, 2023, 4:27 PM IST

మనిషికి జుట్టే అందం. అందుకే కదా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా జుట్టు విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారు. అయినా ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే మన జుట్టు గురించి మనకే తెలియని విషయాలున్నాయి తెలుసా? 
 

జుట్టు మన అందాన్ని పెంచుతుంది. అందుకే జుట్టు విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. ఈ ప్రొడక్ట్ వాడితే జుట్టు పెరుగుతుంది, రాలకుండా ఉంటుందంటే చాలు ఎన్నింటినైనా వాడేస్తుంటారు. జుట్టుపై ఉన్న ప్రేమ అలాంటి. కానీ మనిషి జుట్టు గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి తెలుసా? వీటిని గనుక మీరు తెలుసుకుంటే.. జుట్టుపై మీకున్న ఎన్నో అపోహలు తొలగిపోతాయి. అందుకే మన జుట్టు గురించి మనకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నెత్తిమీద ఇన్ని వెంట్రుకలుంటాయి

మన నెత్తిమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయంటే ఏం చెప్తారు.. లెక్కించడం కష్టం కదా.. అయితే మన నెత్తి ఎంత మందంగా ఉంటుందనే దానిపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పొచ్చంట. సగటున ఒక వ్యక్తికి శరీరమంతా సుమారుగా 5 మిలియన్ల వెంట్రుకల కుదుళ్లు ఉంటాయి. వీటిలో లక్ష మన నెత్తిమీద ఉంటాయట. జెనెటిక్స్ ఆధారంగా అయితే ఈ సంఖ్య లక్ష నుంచి లక్షా యాభై వరకు ఉంటుంది. కొంతమందికి నెత్తిమీద హెయిర్ ఫోలికల్స్ ఎక్కువగా ఉండొచ్చు. వీరికి జుట్టు ఒత్తుగా ఉంటుంది.
 

Latest Videos


ఎన్ని వెంట్రుకలు రాలుతాయంటే..

ప్రతిరోజూ జుట్టు రాలుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. హెయిర్ ఫ్యాక్ట్స్ లో ఇది ఒకటి. మీకు తెలుసా ప్రతిరోజూ మీ దిండుపై, మీ చొక్కాపై ఎన్నో వెంట్రుకలు రాలిపోయి ఉంటాయి ఎప్పుడైనా గమనించారా? ఇది బట్టతలకి సంకేతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. పరిశోధనల ప్రకారం.. రోజుకు 50 నుంచి 150 వెంట్రుకలు ఊడిపోవడం చాలా సహజం. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేనివారికి రోజుకు 200 వెంట్రుకలు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇంతకు మించి మీ జుట్టు రాలుతుందంటే జాగ్రత్త పడాల్సిందే. 
 

శరీరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో కణజాలం 

మానవ శరీరంలో ఎముక మజ్జ కణజాలాలు చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇది మొదటి స్థానంలో ఉంది. కాగా రెండవ స్థానంలో జుట్టు కణజాలాలు ఉన్నాయి. వయోజనుల నెత్తిమీద సుమారు 35 మీటర్ల హెయిర్ ఫైబర్ ను ఉత్పత్తి చేస్తుంది.


తడిగా ఉన్నప్పుడు పొడవుగా కనిపిస్తాయి

మీరెప్పుడైనా గమనించారా? స్నానం చేసినప్పుడు మన వెంట్రుకలు చాలా పొడుగ్గా కనిపిస్తాయనేది? దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అవును ఆరోగ్యకరమైన జుట్టు తంతు తడిగా ఉన్నప్పుడు అదనంగా 30% వరకు సాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొత్త జుట్టు 

పాత జుట్టు ఊడిపోయిన దగ్గరి నుంచే కొత్త జుట్టు ఉత్పత్తి వెంటనే ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 రోజుల్లో కొత్త వెంట్రుక మొలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

జుట్టు జీవితకాలం

ఒక జుట్టు తంతువు మన నెత్తిమీద 5 సంవత్సరాల వరకు ఉంటుందట. అవును ఇది ఒకే జుట్టు తంతువు సగటు ఆయుర్దాయం. అయితే ఒక వ్యక్తి వెంట్రుకల జీవిత కాలాన్ని జెనెటిక్స్, ఇతర విషయాలు కూడా నిర్ణయిస్తాయి. పేలవమైన జెనెటిక్స్ ఉన్నవారికి జుట్టు త్వరగా ఊడిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా మంచి జెనెటిక్స్ లక్షణాలు ఉన్నవారికి వారి నెత్తిమీద 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెరిగే జుట్టు వెంట్రుకలు ఉంటాయి. 

click me!