ఈ దీపావళికి ఇంట్లోని పాత దేవుడి చిత్రాలను, విగ్రహాలను తొలగించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి

First Published | Nov 3, 2023, 3:36 PM IST

diwali 2023: దీపావళి సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రం చేస్తుంటారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులతో పాటుగా విరిగిపోయిన, పాత దేవుళ్ల చిత్రపటాలను, విగ్రహాలను కూడా తొలగిస్తుంటారు. అయితే వీటిని ఎక్కడ వేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుళ్ల విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. 
 

diwali 2022

diwali 2023: ఈ ఏడాది దీపావళి పండుగను ఈ నెల 12 న జరుపుకోబోతున్నాం. దీంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లను శుభ్రం చేయడం మొదలు పెట్టే ఉంటారు. దీపావళికి ఇంట్లో ఉండే పాత వస్తువులను ఇంట్లో నుంచి తొలగిస్తుంటారు. అలాగే విరిగిపోయిన, పాత దేవుళ్ల విగ్రహాలను కూడా ఇడ్ల నుంచి తొలగించేవారు కూడా ఉన్నారు. అయితే దేవుళ్ల విగ్రహాలను చిత్తలో వేయకూడదు. దేవుళ్ల విగ్రహాలు చాలా పవిత్రమైనవి. అందుకే వీటిని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రవహిస్తున్న నదిలో..

మీ ఇంట్లో ఉన్న పాత, చిరిగిపోయిన, లేదా విరిగిపోయిన దేవుళ్ల విగ్రహాలను, చిత్రపటాలను ప్రవహిస్తున్న నదిలో వదిలేయాలి. దీనివల్ల మీకు ఎలాంటి చెడు జరగదు. ఎందుకంటే ఇవి కూడా నీటితో పాటే ప్రవహిస్తాయి. కానీ వీటిని నిలిచిన లేదా సింక్ లో అస్సలు ఉంచకూడదు. 
 


నేలలో..

విరిగిన పాత మట్టి విగ్రహాలను నేలలో పాతిపెట్టొచ్చు. వీటివల్ల అవి మట్టిలో కలిసిపోతాయి. అయితే పాత మట్టివిగ్రహాలను నేలలో పాతిపెట్టే ముందు వాటిని భక్తిశ్రద్ధలతో పసుపు, కుంకుమతో అభిషేకం చేయాలి. దీనివల్ల మీకు ఎలాంటి పాపం అంటుకోదు. అయితే మీరు కొత్త దేవుళ్ల విగ్రహాలను కొనేటప్పుడు అవి మట్టి, రాయితో తయారయ్యాయో లేవో చూసుకోండి. ఎందుకంటే వీటితో తయారయ్యే విగ్రహాలు చాలా సులువుగా మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. 

నీటిలో..

కాగితపు దేవుళ్ల ఫోటోలను బకెట్ నీటిలో వేసి కరిగించొచ్చు. ఇది పూర్తిగా గుజ్జుగా అయిన తర్వాత.. దానిని ఉపయోగించి చెట్టును నాటండి. ఒకవేళ ఫోటో ఫ్రేమ్ అయితే ఫ్రేమ్ నుంచి ఫోటోను బయటకు తీయండి. ఒకవేళ ఫ్రేమ్ పగిలిపోతే దాన్ని పారేసి ఫోటోను నీటిలో కరిగించండి. లేదా చెట్టును నాటే మట్టిలో కలపొచ్చు. 
 

Latest Videos

click me!