దీపావళి రోజు పిండి దీపాలను ఎందుకు వెలిగిస్తారు?

First Published Nov 3, 2023, 2:42 PM IST

diwali 2023: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఈ రోజున శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడని, అతని ఆనందంలో అయోధ్య ప్రజలు నెయ్యి దీపాలను వెలిగించారని నమ్ముతారు.

diwali 2023: సనాతన ధర్మంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటుంటారు. ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.  మీకు తెలుసా ఈ దీపావళి రోజునే శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడని నమ్ముతారు. రాముడి రాకతో ఆనందపడ్డ అయోధ్య వాసులు నెయ్యి దీపాలను వెలిగించారని చెప్తారు. ఇది దీపావళి పండుగకు దగ్గరగా ఉంటుంది. 

పిండి దీపాలు

అమావాస్య తిథి తర్వాత రోజును చోటీ దీపావళి అంటారు. ఈ రోజున పిండి దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. మీకు తెలుసా? ఈ చోటీ దీపావళి నాడు యముడిని పూజిస్తారు. యముడికి పిండి దీపాన్ని వెలిగిస్తే నరకానికి వెళ్లరని నమ్ముతారు.

అంతేకాదు పిండి దీపాన్ని వెలిగిస్తే యమదేవుడి కన్నుమన కుటుంబంపై ఉండదంటారు. అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో పిండి దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు. అయితే ఈ దీపాన్ని వెలిగించి మీ ఇంట్లోని ప్రతి మూలా తిప్పాలి.  ఆ తర్వాత దీన్ని దక్షిణ దిశలో పెట్టాలి. ఎందుకంటే ఈ దిక్కునే యమదేవుడు ఉండాటని భావిస్తారు. 

దీపావళి ప్రాముఖ్యత

సనాతన ధర్మం ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా  కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ దీపాల పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని, వినాయకుడని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. దీపావళి నాడు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన భక్తులకు శ్రేయస్సు, ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు.

click me!