Bed Room Facts: సినిమాల ఎఫెక్ట్ తోనో మరెకారణం చేతనో గాని శోభనం రాత్రిని ప్రత్యేకంగా, అందరికీ భిన్నంగా జరుపుకోవలని ఆశపడుతుంటారు చాలా మంది. ఎలాగంటే.. సినిమాల్లో మాదిరి శోభనపు గదంతా గులాబీ పువ్వులూ, మల్లెపూలతో అలంకరించుకోవాలని, వధువు పాలగ్లాసుతో గదిలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారు. ఇదంతా మనం నిత్యం సినిమాల్లో చూస్తున్న తంతే. అయితే శోభనం రాత్రి పడక గదిని, బెడ్ ను గులాబీ రెక్కలతో అందంగా అలంకరించడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అన్ని పువ్వుల్లో గులాబీ చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. అందుకే కదా వువ్వుల్లో గులాబీ పువ్వే అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ పువ్వులు అందానికే కాదు ప్రేమకు చిహ్నంగా కూడా పేరుపొందాయి. అందుకే చాలా మంది ప్రపొజ్ చేయాలంటే ముందుగా ఒక గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను చెబుతుంటారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే గులాబీ పువ్వులు అందమైన పరిమళాన్ని వెదజల్లుతాయి. గులాబీల అందానికి వెలకట్టడం అసాధ్యం. గులాబీ పువ్వులు ఆడవారికే కాదు మగవారి సెక్సువల్ సామర్థ్యానికి కూడా సంకేంతాలుగా పిలవబడుతున్నాయి. అందుకే శోభనం రోజున గదినంతా గులాబీ పువ్వులతో అందంగా అలంకరిస్తారు.
ఆయుర్వేదం ప్రకారం.. శోభనం రాత్రిన వధూవరులిద్దరూ సెక్సువల్ గా యాక్టీవ్ గా ఫీలయ్యేలా చేయడంలో ఈ గులాబీ పువ్వులు ముందుంటాయి. అంతేకాదు ఈ గులాబీ పువ్వులను పాయసంలో లేదా పాలలలో వేసుకుని ఓ ఫ్లేవర్ గా కూడా తాగుతారు.
గులాబీ పువ్వులు ఆవేశాన్ని, తీవ్రమైన ఇత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఈ పువ్వులు ప్రతిఒక్కరినీ ఉత్తేజంగా, ఆనందంగా ఉండేలా చేస్తాయి. ఓ అధ్యయనం ప్రకారం.. బెడ్ పై ఉండే గులాబీ పువ్వులు సెక్సువల్ ఫీలింగ్ ను తెప్పించి భాగస్వామిని సంతోషపెట్టేలే చేయడానికి ఇవి ఎంతో ఉపయోగాపడతాయట. ముఖ్యంగా ఈ గులాబీ పువ్వులు వ్యక్తుల మూడ్ ను తొందరగా ఛేంజ్ చేయగలవు. ఉత్తేజితంగా కూడా మార్చగలవు.
గులాబీల్లో ఉండే ప్రత్యేకత వల్ల పడక గదిలో సరికొత్త మత్తులోకి తీసుకెళతాయి. అంతేకాదు ఇవి అనిర్వచనీయమైన మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకే పడక గదులను గులాబీ పువ్వులతో అందంగా ముస్తాబై ఉంటాయి.