Relationship: మీ భాగస్వామి మీకు నిజం చెప్తున్నాడో.. అబద్దం చెప్తున్నాడో ఇలా తెలుసుకోండి..

First Published | Feb 12, 2022, 2:58 PM IST


Relationship:  గొడవలు, కొట్లాటలు లేని రిలేషన్ షిప్ లో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అనుకోని కారణాల వల్ల ఇద్దరి మధ్యన గొడవలు వచ్చే అవకాశం  ఉంది. అయితే ప్రాబ్లమ్స్ చిన్నవే అయినా కొన్ని కొన్ని సార్లు అవే ఇద్దరూ విడిపోయే దాకా తీసుకెళ్తాయి. అలాంటి వాటిని మొదట్లోనే పరిష్కరించుకుంటే ఆ బంధంలో ఎలాంటి సమస్యలు రావు. లైఫ్ హ్యాపీగా సాగుతుంది.

Relationship: రిలేషన్ షిప్ అందంగా, హాయిగా సాగిపోవాలని ఎవ్వరికుండదు చెప్పండి. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యపడకపోవచ్చు. ముఖ్యంగా రిలేషన్ షిప్ లో కొట్లాటలు, గొడవలకు తావుండకూడదంటే కొన్నిమేము సూచించే టిప్స్ ను తప్పక పాటించాల్సిందే. 

మీ భార్య లేదా భర్త ఎమోషనల్ స్టేట్ ని లేదా టెంపర్ ను అర్థం చేసుకోవడానికి ఈ సింపుల్ ట్రిక్స్ మీకు భాగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఆర్టికల్ మొత్తం చదివేసి.. మీ భార్య లేదా భర్త ఎమోషనల్ స్టేటస్ ను అర్థం చేసుకుని వారిని మానసికంగా అర్థం చేసుకోండి. ఇవి మీ బంధాన్ని మరింత బలంగా చేసుుకోండి. 


బడీ లాంగ్వేంజ్:  బాడీ లాంగ్వేజ్ ను చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఈ బాడీ లాంగ్వేజ్ మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి మనకు నిజం చెప్తున్నాడా? లేదా? అనే విషయాన్ని క్లారిఫై చేస్తుంది. కొంతమంది వ్యక్తులు నోటి నుంచి ఒకటి చెప్తే.. వారి బాడీ లాంగ్వేజ్ మనకు మరో విషయాన్ని చెబుతుంది. మీ పార్టనర్ నవ్వితే.. అది ఫేక్ నవ్వా? లేకా మనస్ఫూర్తిగానే నవ్వుతున్నాడో బాడీ లాంగ్వేజ్ ను బట్టి ఇట్టే కనిపెట్టేయొచ్చు. కాబట్టి మీ భాగస్వామి మీకేదైనా విషయం చెబుతున్నప్పుడు అతని బాడీ లాంగ్వేజీని కూడా గమనించండి.

కళ్లు: మన నోరు ఎన్ని పచ్చి అబద్దాలు చెప్పినా.. మన కళ్లు మాత్రం ఎప్పటికీ అబద్దాన్ని చెప్పలేవు. అందుకే చాలా మంది ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఎక్కువగా వాళ్ళ కళ్ల వైపే చూస్తుంటారు. అది నిజమా? కాదా?  అని. కళ్ల అందమైనవే కావు.. అబద్దాలను కూడా చెప్పవు. కాబట్టి ఎదుటి వారు మనకు చెప్పే విషయం నిజమా? కాదా? అనేది తెలుసుకోవచ్చు. ఐ కాంటాక్ట్ తో ఎదుటివాళ్లను తొందరగా అర్థం చేసుకోచ్చు. 
 

టోన్: ఒక వ్యక్తి మాట్లాడే విధానం బట్టి వారు ఎలాంటి ఎమోషన్స్ లో ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఎదుటి వ్యక్తి గట్టి గట్టి మాట్లాడితే అతను కోపంగా ఉన్నాడని మనం అర్థం చేసుకుంటాం. అదే అతను నెమ్మదిగా మాట్లాడితే.. ఏదో విషయం మననుంచి దాచడం, లేదా అతను చెప్పేది అబద్దమో కనిపెట్టేయోచ్చు. కాబట్టి మీ పార్టనర్ ను మీరు అర్థం చేసుకోవాలనుంటే వారు మాట్లాడే టోన్ ను బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. టోన్ ద్వారా ఎదుటివారి నుంచి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చనే సంగతి గుర్తుంచుకోండి.

ఎనర్జీ: ఎదుటివారి ఎనర్జీతో కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారా? లేదా ? వంటి విషయాలను వాళ్ల ఎనర్జీని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడకపోతే.. నామమాత్రంగా మాట్లాడుతుంటారు. కాబట్టి మీ భాగస్వామి ఎనర్జీ బట్టి కూడా వారిని అంచనా వేయవచ్చు. 

బ్రీతింగ్: శ్వాసతీసుకునే విధానాన్ని బట్టి కూడా ఎదుటివారి మానసిక స్థితి ఎలాంటిదో కనిపెట్టేయొచ్చు. ఒకవేళ మీ భాగస్వామి శ్వాస సాధారణంగా కాకుండా వేరే విధంగా వస్తే వాళ్లు టెన్షన్ పడుతున్నట్టు అర్థం. ఒక వేళ వారు సంతోషంగా లేదా కాన్ఫిడెంట్ గా ఉంటే ఇంకో విధమైన శ్వాస వస్తుంది. ఒకవేళ కంగారు పడితే మరోలా వస్తుంది. కాబట్టి శ్వాస ద్వారా కూడా మీ భాగస్వామిని అర్థం చేసుకోవచ్చు.  
 

Latest Videos

click me!