ఇన్ స్టాంట్ దోశకు కావాల్సిన పదార్థాలు...
బియ్యం పిండి, శనగ పిండి, బొంబాయి రవ్వ, రెండు బంగాళ దుంపలు, చిన్న కప్పు పెరుగు, నీరు
దోశ పిండి తయారీ విధానం...
ముందుగా... మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగ పిండి, అర కప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఇందులోనే.. రెండు బంగాళ దుంపలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే.. పావు కప్పు పెరుగు, కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత... పిండిని బాగా కలిపి అందులో ఉప్పు వేయాలి. ఆ ఉప్పు మీద అర చెక్క నిమ్మరసం పిండాలి. ఆ తర్వాత.. పిండిని బాగా కలుపుకోవాలి. అవసరం అయితే.. కొద్దిగా నీరు కలుపుకోవాలి. అంతే దోశ పిండి రెడీ అయినట్లే.