కూరగాయలు, పండ్ల వ్యర్థాల వల్ల వచ్చే చెడు వాసనను బేకింగ్ సోడా ఇట్టే మాయం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలిపి, ఆ నీటితో ర్యాక్ ను తుడవండి. మొండి మరకలను నెమ్మదిగా రుద్ది, ఆ తర్వాత సబ్బు పోయేలా శుభ్రమైన నీటితో కడగాలి.
ర్యాక్ హ్యాండిల్స్, మూలల్లో మురికి ఈజీగా దాక్కుంటుంది. వీటిని క్లీన్ చేయడానికి పాత టూత్ బ్రష్ లేదా సాఫ్ట్ బ్రష్ వాడటం బెస్ట్. గట్టి మరకలపై సబ్బు నీరు రాసి కాసేపు నాననిచ్చి రుద్దండి. కానీ పదునైన వస్తువులతో అస్సలు గీకకండి.
కేవలం కడిగి వదిలేస్తే సరిపోదు. అది ఉండే ఫ్రిడ్జ్ అడుగు భాగం, పక్క గోడలపై కూడా మురికి ఉంటుంది. గోరువెచ్చని సబ్బు నీటితో ఆ ప్రదేశాలను తుడిచి, ఆ తర్వాత తడి గుడ్డతో క్లీన్ చేయండి.
ఇలా చేస్తున్నప్పుడు ఫ్రిడ్జ్ ఎలక్ట్రికల్ పార్ట్స్, గాలి వచ్చే రంధ్రాల్లోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చివరగా పొడి గుడ్డతో తడి లేకుండా పూర్తిగా తుడిచేయాలి.