భారతీయ రైల్వే కోట్లాదిమందిని గమ్యస్థానాలకు చేర్చడమే కాదు లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో భారత రైల్వేది రెండో స్థానం. ఇలా ప్రత్యక్షంగా ఉద్యోగులు కలిగినవారే కాదు పరోక్షంగా లక్షలాదిమంది రైల్వే ద్వారా ఉపాధి పొందుతున్నారు.
భారతదేశం 68,000 కి.మీ కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లు కలిగి వుంది. ఇందులో 45,000 కిలోమీటర్లకు పైగా విద్యుదీకరించబడిన రైలు నెట్‌వర్క్ వుంది. అలాగే వేలాది రైళ్లు మనషులనే కాదు సరుకు రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశ అభివృద్దిలోనే కాదు ఆర్థిక వృద్దిలోనూ ఇండియన్ రైల్వేస్ భాగస్వామ్యం అవుతున్నాయి.