ఫ్రిజ్ లో పండ్లను పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Sep 17, 2024, 10:05 AM IST

మనలో చాలా మంది పండ్లను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనేసి పాడవకుండా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ పండ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు తెలుసా? ఎందుకంటే?

పండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఫ్రిజ్ లో పెట్టాల్సిందేనంటారు చాలా మంది. మిగిలిపోయిన అన్నం, కూరల నుంచి చపాతీలు, బ్రెడ్ పప్పులు కూల్ డ్రింక్స్ నుంచి పండ్లు, కూరగాయల వరకు ఫ్రిజ్ ను రకరకాల పదార్థాలతో నింపేస్తుంటారు. నిజానికి ఫ్రిజ్ లో పండ్లను పెడితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. తొంరదగా పాడవవు.
 

కానీ కొన్ని రకాల పండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటి రుచి పోతుంది. పోషకాలు కూడా తగ్గుతాయి. అసలు ఏయే పండ్లను ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


అరటి పండ్లు

అరటి పండ్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. వీటి ధర కూడా ఎక్కువగా ఉండదు. కానీ ఈ పండ్ల టేస్ట్ బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తింటుంటారు. అయితే చాలా మంది వారానికి సరిపడా పండ్లను కొనేసి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. దీంతో పండ్లు తొందరగా పాడవవని. కానీ ఫ్రిజ్ లోని చల్లని ఉష్ణోగ్రత అరటిపండ్లను గోధుమ రంగులోకి మార్చేస్తుంది.

 అలాగే పండ్ల టేస్ట్ కూడా మారుతుంది. అంటే ఇది పండ్లు పండే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే వాటిని మరింత మెత్తగా మార్చేస్తుంది. అలాగేవాటిలో పోషకాలను కోల్పోయేలా చేస్తుంది. అరటి పండ్లు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ఎప్పుడూ కూడా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి. అలాగే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. 
 

fridge


టమాటాలు

టమాటాలను కూడా చాలా మంది ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఎందుకంటే దీనివల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయని. చల్లని ఉష్ణోగ్రత వల్ల టమాటాలు వాటి రుచిని కోల్పోతాయి. అలాగే మృదువుగా అవుతాయి. టమాటాలను ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా ఉంచి గది ఉష్ణోగ్రత వద్ద ఒక బుట్టలో వేసి ఉంచండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి. 

అవొకాడో

అసలు అవొకాడోను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలో ఉంటే అవొకాడోలు సరిగ్గా పండవు. ఫ్రిజ్ లో వీటిని పెడితే వాటి టేస్ట్ పూర్తిగా పోతుంది. అలాగే మృదువుగా అవుతాయి. అవొకాడోలను ఎప్పుడూ కూడా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. అవొకాడో పండిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి మీరు ఫ్రిజ్ లో పెట్టొచ్చు. 

పైనాపిల్

పైనాపిల్ ను కూడా చాలా మంది ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ పైనాపిల్స్ పూర్తిగా పండే వరకు ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు పండే ప్రక్రియను ఆపేస్తాయి. అలాగే పైనాపిల్ పొడిగా, రుచి లేకుండా అవుతాయి. పైనాపిల్ బాగా పండిన తర్వాత మీరు వాటిని కొన్ని రోజుల వరకు పెట్టొచ్చు. 

సిట్రస్ పండ్లు

నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతల వద్ద సిట్రస్ పండ్లు వాటి టేస్ట్ ను కోల్పోతాయి. అలాగే డ్రై గా అవుతాయి. మీరు గది ఉష్ణోగ్రత వద్ద ఈ పండ్లను నిల్వ చేయొచ్చు. అయితే మీరు సిట్రస్ పండ్ల రసాలను మాత్రం కొన్ని రోజు వరకు ఫ్రిజ్ లో పెట్టొచ్చు. 

Latest Videos

click me!