నువ్వుల నూనె
దంతాలపై ఉన్న పసుపు పచ్చ మరకలు పోవాలంటే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే నువ్వుల నూనెతో పుక్కిలించండి. ఇది మీ దంతాలు దృఢంగా కూడా చేస్తుంది. అలాగే తిన్న తర్వాత రాత్రిపూట ఖచ్చితంగా బ్రష్ చేయాలి. మీరు రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రిపూట పళ్లను తోముకుంటే మీ దంతాలు బలంగా ఉంటాయి. తెల్లగా కూడా ఉంటాయి.
అయితే పై పద్ధతులను ఉపయోగించి పసుపు పచ్చ దంతాలను తెల్లగా చేయడానికి ప్రయత్నించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దంతాలు తెల్లగా ఉండాలని మీరు ఎక్కువ సేపు బ్రష్ చేసినా, ఎక్కువసేపు ఆయిల్ పుల్లింగ్ చేసినా మీ దంతాలు దెబ్బతింటాయి.