వేసవి కాలపు (Summer) సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ పర్యాటక ప్రదేశాలు అందమైన ప్రకృతితో (Beautiful nature) మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒక్కో పర్యాటక ప్రదేశాలకు ఒక్కో విశిష్టత ఉంటుంది. వీటిని సందర్శించడానికి పర్యాటకులు లక్షల్లో వస్తుంటారు.
మున్నార్ (Munnar): మున్నార్ హిల్ స్టేషన్ (Hill Station) కేరళలో ఉంది. ఇక్కడ ఉన్న కాఫీ తోటలు (Coffee plantations) నిత్యం సువాసనలు వెదజల్లుతూ చూడటానికి అందంగా పచ్చదనంతో ఉంటుంది. ఇది సముద్రమట్టానికి 7000 అడుగుల ఎత్తున ఉంది.
లడఖ్ (Ladakh): ఇది భారతదేశానికి ఉత్తరదిక్కున (North side) చైనా బార్డర్ కు దగ్గరలో ఉన్న చిట్టచివరి ప్రదేశం. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు ఇక్కడ ఉంది. నీలి రంగులో ఉన్న ఆకాశం, మంచుతో మునిగిన పర్వతాలూ చూడడానికి కనులవిందుగా ఉంటుంది.
గోల్డెన్ టెంపుల్ (Golden temple): గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లోని అమృత్ సర్ (Amritsar) లో ఉంది. ఈ స్వర్ణ ప్యాలెస్ చుట్టూ నీరు ఉంటుంది. రాత్రి సమయంలో లైట్లతో చూడడానికి ఆకర్షణగా ఉంటుంది. గురుద్వారా యొక్క పై అంతస్తును బంగారంతో పూతవేసారు.
కోల్ కత్తా (Kolkata): కాళీఘాట్ (Kalighat), విక్టోరియా మహల్ (Victoria mahal), హౌరా బ్రిడ్జి (Howrah Bridge), ఆలిపోరా జూ మనసును ఆకట్టుకునే ప్రదేశాలు. ఇక్కడకు ఎంతోమంది పర్యాటకులు వచ్చి ఇక్కడున్న ప్రదేశాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.
ఒరిస్సా (Orissa): పూరి, కోణార్క్, భువనేశ్వర్ హెరిటేజ్ ప్రదేశాలను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ (Golden triangle) అంటారు. పూరిలో జగన్నాథ ఆలయం రథోత్సవాన్ని సందర్శించడానికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. పూరి జగన్నాథ (Puri Jagannath Temple) ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కోణార్క్ లో సూర్య దేవాలయం, భువనేశ్వర్ లో లింగరాజ్ దేవాలయం ప్రసిద్ధి.