India Vs Pakistan: ఏ దేశంలో ఎక్కువ మాంసం తింటారు? రోజుకి ఎన్ని కిలోల నాన్ వెజ్ తింటారు?

Published : Jul 28, 2026, 04:52 PM IST

India Vs Pakistan: నాన్ వెజ్  ఏ దేశంలో ఎక్కువగా తింటారు? ముఖ్యంగా  భారత్, పాకిస్తాన్ లలో ఏ దేశంలో ఎక్కువ నాన్ వెజ్ తింటున్నారు?  ఒక రోజులో ఎన్ని కిలోల మాంసం తింటున్నారు?

PREV
14
మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉన్న దేశం ఏది?

దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండూ మాంసాహారం  ఎక్కువగా తినే దేశాలు.  కానీ.. ఈ రెండు దేశాల ఆహార అలవాట్లు పూర్తి భిన్నంగా ఉంటాయి. భారత్ లో నాన్ వెజ్ ప్రియులు ఎంత మంది ఉంటారో.. పూర్తిగా శాకాహారం తినేవారు కూడా అంతే ఉన్నారు. మరి.. ఈ రెండు దేశాల్లో మాంసం ఎక్కువగా ఎవరు తింటున్నారు? ఈ విషయంలో ముందు ఏ దేశం ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

24
సర్వేలు ఏం చెబుతున్నాయి..?

తాజా సర్వేల ప్రకారం, భారత దేశంలో రోజు రోజుకీ మాంసాహారం తినే వారి సంఖ్య పెరుగుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం, 15 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న వారిలో దాదాపు 80 శాతం మంది నాన్ వెజ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే.. ప్రోటీన్ కోసం నాన్ వెజ్ మీద ఆధారపడుతున్నారు.వీటిలో ముఖ్యంగా  చేపలు, చికెన్ , కోడి గుడ్లు ఎక్కువగా ఉన్నాయి.

2006లో 74%గా ఉన్న ఈ సంఖ్య, 2021 నాటికి 80 శాతానికి పెరిగింది. సర్వే ప్రకారం, ప్రతి 10 మందిలో ఒకరు ప్రతిరోజూ మాంసాహారం తింటున్నారు. ఇక 60% మంది వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు నాన్‌వెజ్ తింటున్నారు. భారత జనాభా 140 కోట్లకు పైగా ఉన్నందున, మొత్తం మాంసం వినియోగం చాలా ఎక్కువగా ఉంది.

34
రోజుకి ఎంత తింటున్నారు..?

ఐసీడీ (ICD) గణాంకాల ప్రకారం, ఒక భారతీయుడు రోజుకు సగటున 3 కేజీల మాంసం తింటాడని ఒక అంచనా ఉంది.

కొన్ని నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో 38% మంది బీఫ్, 34% మంది చికెన్, 25% మంది మటన్ తినడానికి ఇష్టపడతారు. 2000 సంవత్సరంలో, అక్కడ ఒక వ్యక్తి సగటున 11.7 కేజీల మాంసం తినేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య సంవత్సరానికి 32 కేజీలకు పెరిగింది. అంతర్జాతీయ డేటా ప్రకారం, తలసరి వినియోగం 12.7 కేజీలుగా ఉంది.

44
భారత్ వర్సెస్ పాకిస్తాన్
గణాంకాలను బట్టి చూస్తే, తలసరి మాంసం వినియోగంలో పాకిస్తాన్ భారత్ కంటే ముందుంది. మతపరమైన సంప్రదాయాలు, ప్రాంతీయ ఆహార వైవిధ్యం కారణంగా భారత్‌లో శాకాహారుల జనాభా ఎక్కువ. పాకిస్తాన్‌లో చాలా మంది మాంసాహారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ బీఫ్, మటన్, చికెన్ ఎక్కువగా తింటారు.
Read more Photos on
click me!

Recommended Stories