స్పీచ్ ను ఎలా స్టార్ట్ చేయాలి?
గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి , ఉపాధ్యాయులు, నా ప్రియమైన స్నేహితులందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన దేశం 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నేటి భారతదేశంలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. 78 ఏండ్ల కిందట స్వాతంత్ర్య సమరయోధులు పరాయి పాలనకు అతీతంగా ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారు. స్వేచ్ఛావాయువును పీల్చడం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. స్వేచ్ఛ అంటే వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని పొందడం మాత్రమే కాదు.. అందరూ విద్య, సమానత్వం, అవకాశాలను కలిగి ఉండటం కూడా.
నేటి భారతదేశంలో స్వేచ్ఛ అంటే మనల్ని మనం వ్యక్తీకరించుకునే సామర్థ్యం, మన సమాజ పురోగతికి దోహదపడే సామర్థ్యం, నూతన ఆవిష్కరణలు. పర్యావరణాన్ని పరిరక్షించడం, చట్టాన్ని గౌరవించడం,అవసరమైన వారికి సహాయం చేయడం కూడా మన బాధ్యతే. నేడు మనం అంతరిక్ష అన్వేషణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వృద్ధిలో మనం ఎంతో పురోగతి సాధించాం. అయినా పేదరికం, అసమానతలు, పర్యావరణ సమస్యలు అలాగే ఉన్నాయి. యువ పౌరులుగా ధైర్యం, సృజనాత్మకత,ఐక్యతతో ఈ సమస్యలను ఎదుర్కోవడం మన కర్తవ్యం. స్వేచ్ఛ అనేది మనం గౌరవించాల్సిన, సంరక్షించాల్సిన బహుమతి. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ మెరుగైన భారతదేశం కోసం కలిసి పనిచేస్తామని ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్!