రోజూ ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 14, 2024, 5:03 PM IST

కొబ్బరి నూనెను మనం సహజంగా జుట్టు సంరక్షణ కోసం వాడుతూ ఉంటాం. కొందరు వంటకు కూడా ఉపయోగిస్తారు. మరి.. అలాంటి కొబ్బరి నూనెను  రోజూ ఒక స్పూన్ తీసుకుంటే మన శరీరంలో వచ్చే మార్పులేంటో తెలుసుకుందాం..

సహజంగా మనం కొబ్బరి నూనెను జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తాం. కొబ్బరి నూనెతో వంట చేసుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కొబ్బరి నూనె మనకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఆయుర్వేదంలో కొబ్బరి చెట్టును కల్పవృఖ్షం అని కూడా పిలుస్తారు. అంటే.. మన జీవితానికి అవసరమైనవి అన్నీ ఇచ్చే చెట్టు అని అర్థం.  కొబ్బరి నూనె రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది.  మరి... ఈ కొబ్బరి నూనెను ప్రతిరోజూ ఉదయం టానిక్ లాగా ఒక స్పూన్  తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? మీ శరీరానికి జరిగే మార్పులు ఏంటో ఓసారి తెలుసుకుందాం..

మానసిక స్థితి మెరుగుపడుతుంది...

కొబ్బరి నూనెని ఉదయాన్నే తీసుకుంటే ప్రశాంతంగా, ఆందోళన తక్కువగా ఉంటారు.  ఇందులో ఎన్నో నాడీ సంబంధిత ప్రయోజనాలున్నాయి. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు మీ మానసిక స్థితిని మారుస్తాయి.  దీనివల్ల ప్రశాంతత కలుగుతుంది. 

ఉత్సాహం: 

ఇతర నూనెల్లా కొవ్వుతో బరువుగా అనిపించకుండా, శక్తి స్థాయిలను పెంచడంలో ఈ నూనె సహాయపడుతుంది. ఉదయాన్నే కొబ్బరి నూనె తీసుకుంటే చురుగ్గా ఉంటారు. రోజంతా శక్తితో ఉండడానికి ఇది సహాయపడుతుంది. 

Latest Videos


హార్మోన్ల సమతుల్యత: 

కొబ్బరి నూనె ఉత్సాహంగా ఉండడానికి శక్తినిస్తుంది.  థైరాయిడ్ సమస్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో జీవక్రియను  మెరుగుపరిచి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెలోని కొవ్వు ఆమ్లాలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ సమస్య ఉండదు.  ఇవి త్వరగా శక్తిగా మారతాయి.  శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది.

చర్మ సంరక్షణ: 

పొడి చర్మానికి తేమను అందించడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది.  క్షతిగ్రస్త చర్మాన్ని మెరుగుపరచడంలో కూడా కొబ్బరి నూనె ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ఆయుర్వేద మసాజ్ లలో దీన్ని ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెలోని కొన్ని లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. 

రోగనిరోధక శక్తి:  

కొబ్బరి నూనెలోని యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలు వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరచడంలో సహాయపడతాయి. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ కి ఈ నూనెను ఉపయోగించవచ్చు. నోటి ఆరోగ్యం రోగనిరోధక శక్తికి సంబంధించినది. 

ఆయిల్ పుల్లింగ్; 

ఒక స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని 10 నిమిషాలు పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతాయి.  ఈ ఆయిల్ పుల్లింగ్ పళ్ళలోని అనవసరమైన మలినాల్ని తొలగిస్తుంది. 

ఎలా తాగాలి? 

కొబ్బరి నూనె తాగితే కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనె కలిపి తాగవచ్చు.  ఇలా రోజూ ఉదయాన్నే  కొబ్బరి నూనెని వేడి నీటితో కలిపి తాగితే శరీర బరువు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 

కొబ్బరి నూనె ప్రయోజనాల కోసం రోజుకి 1 స్పూన్ నూనె తాగవచ్చు.

click me!