షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడానికి కేవలం మెంతుల వాటర్ తాగితే సరిపోతుందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మీరు కనుక రాత్రి పడుకునే ముందు మెంతుల వాటర్ తాగితే.. ఈజీగా రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయవచ్చట. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో మెంతి నీరు ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నిర్వహిస్తుంది.మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
మెంతుల స్వభావం వేడిగా ఉంటుంది.రుచి చేదుగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్లూకోస్ టాలరెన్స్‌ని పెంచుతుంది.ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. మెంతి గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇవి శరీరంలోని పిండి పదార్థాలు,చక్కెరల శోషణను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మెంతి గింజల్లో గెలాక్టోమన్నన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఇది బరువును తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.