Curry leaves oil: కరివేపాకులను ఇలా వాడారంటే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం ఖాయం

Published : Apr 22, 2026, 10:03 AM IST

Curry leaves oil: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి చాలా సింపుల్ చిట్కా అందుబాటులో ఉంది. కరివేపాకులను వాడడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కరివేపాకులను ఎలా వాడాలో ఇక్కడ ఇచ్చాము. ఇలా వాడితే జుట్టు పొడవుగా కూడా పెరుగుతుంది. 

PREV
13
జుట్టు తెల్లబడే సమస్య

యాభై ఏళ్ల వయసు దాటాక జుట్టు తెల్లబడడం సహజం. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో చిన్న పిల్లలకు, పాతికేళ్ల వయసులో ఉన్న వారికి కూడా జుట్టు తెల్లబడిపోతుంది. దీంతో వారు రసాయనాలు కలిపిన రంగులను జుట్టుకు పట్టిస్తున్నారు. ఇది ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు కరివేపాకును వాడడం ద్వారా మళ్లీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి.

23
కరివేపాకు నూనె తయారీ

కరివేపాకులను ఏరి శుభ్రంగా కడిగా తడి ఆరబెట్టుకోవాలి. ముందుగా ఒక ఇనుముతో చేసిన కళాయిన తీసుకొని స్టవ్ మీద పెట్టండి. అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. కొబ్బరి నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకులను అందులో వేసి నల్లగా మారే వరకు వేయించండి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆ నూనెను చల్లార్చి ఒక బాటిల్ లో వేసుకోండి.

33
ఈ నూనె ఎలా వాడాలి?

తరచూ ఆ నూనెను మీ జుట్టుకు పట్టిస్తూ ఉండండి. ఆ నూనెను మాడుకు తగిలేలా సున్నితంగా మసాజ్ చేయాలి. జుట్టుకు రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనె, కరివేపాకు రెండూ కూడా జుట్టుకు ఎంతో మేలు చేసేవే. దీన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటే కొన్నాళ్లకు మీకు మంచి మార్పులు కనిపిస్తాయి. తెల్ల జుట్టు నల్లగా మారడం మొదలవుతుంది. అయితే ఈ నూనెను ప్రతిరోజు ఉపయోగించేందుకు ప్రయత్నించండి. కరివేపాకులు, కొబ్బరి నూనె కలిసిన మిశ్రమం జుట్టును బలంగా కూడా మారుస్తుంది. కరివేపాకులోని పోషకాలు జుట్టును పొడవుగా పెరిగేలా సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories